జాగ్రత్త!.. భారత్‌లో ఈ 3 ఉద్యోగాలకు AI గండం!

Artificial Intelligence: కృత్రిమ మేధస్సు(AI) రాకతో ఉద్యోగాలపై ఆందోళన పెరుగుతోంది. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం.. భారత్‌లో వచ్చే ఐదేళ్లలో కొన్ని ఉద్యోగాలు ఏఐ కారణంగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అయితే ఏఐ కొన్ని కొత్త ఉద్యోగాలను కూడా సృష్టించనుందని ఈ నివేదిక పేర్కొంది. ఏఐ ప్రవేశంతో అనేక ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. భారత్‌లో కూడా ఏఐ వినియోగం పెరుగుతోంది. ఒక మనిషి రోజులు తరబడి చేసే పనిని ఏఐ నిమిషాల్లో పూర్తి చేయగలుగుతోంది. ఈ కారణంగా కంపెనీలు కూడా మనుషుల కంటే ఏఐకి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇటీవల "సర్వీస్‌నౌ"(ServiceNow) విడుదల చేసిన నివేదికలో వచ్చే ఐదేళ్లలో భారత్‌లో 3 రకాల ఉద్యోగాలను ఏఐ కనుమరుగు చేస్తుందని పేర్కొంది.

ఈ మూడు ఉద్యోగాలకు గండం
మనీకంట్రోల్ నివేదిక సర్వీస్‌నౌ ప్రకారం, వచ్చే ఐదేళ్లలో ఏఐ కొన్ని ఉద్యోగాలను పూర్తిగా తొలగిస్తుందని వెల్లడించింది. వీటిలో ప్రధానంగా మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి:

1. డేటా ఎంట్రీ (Data Entry): భారీ స్థాయిలో డేటాను మాన్యువల్‌గా నమోదు చేసే పనులు ఏఐ ద్వారా పూర్తిగా ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది.

2. టెలికాలింగ్ (Telecalling): కస్టమర్‌లకు ఫోన్ చేసి సమాచారం అందించడం లేదా సేవలు అందించే టెలికాలింగ్ పాత్రలను ఏఐ చాట్‌బాట్‌లు లేదా వాయిస్ అసిస్టెంట్‌లు సమర్థవంతంగా నిర్వహించగలవు.

3. ప్రాథమిక కస్టమర్ సర్వీస్ (Basic Customer Service): సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం వంటి కస్టమర్ సేవా పనులు ఏఐ ఆధారిత సిస్టమ్స్‌కు మారే అవకాశం ఉంది.

These 3 Jobs in India Are at Risk from Artificial Intelligence

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పాత్రలు కనుమరుగైపోతాయి లేదా గణనీయంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ పనులను ఏఐ టూల్స్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా అత్యంత వేగంగా, కచ్చితంగా చేయవచ్చు. దీనివల్ల పనులు త్వరితగతిన పూర్తవడమే కాకుండా వాటిని పూర్తి చేయడానికి కంపెనీలకు అయ్యే ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుంది.

ఏఐ వినియోగాన్ని ప్రారంభించిన కంపెనీలు
నిజానికి కొన్ని కంపెనీలు ఇప్పటికే ఏఐ చాట్‌బాట్లను ఉపయోగించడం ప్రారంభించాయి. ఏఐ మానవ సిబ్బందిన భర్తీ చేసి బుకింగ్‌ల వంటి పనులను స్వయంగా నిర్వహిస్తోంది. అంతే కాకుండా ఆఫీసుల్లో ఫైళ్లను ఎంచుకోవడం లేదా వేరు చేయడం, రెజ్యూమెలను సమీక్షించడం, పత్రాలను తనిఖీ చేయడం వంటి పనులు ఏఐ ద్వారా జరుగుతున్నాయి. ప్రస్తుతం అధునాతన టెక్ కంపెనీలు ఏఐ వైపు దృష్టి సారిస్తున్నాయి.

మానవుల కంటే ఏఐపై ఎందుకంత నమ్మకం?
ఏఐపై నమ్మకం పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రతి వ్యాపారంలోనూ యాజమాన్యం ఖర్చులను తగ్గించుకోవాలని కోరుకుంటుంది. నిజంగా ఉద్యోగులతో పోలిస్తే ఏఐ చౌకగా ఉంటుందని కంపెనీలు దీనిపై నమ్మకం చూపుతున్నాయి. అంతే కాకుండా ఏఐ మానవుల వలె విశ్రాంతి సమయం అడగదు. ఇది ఆగకుండా, అలసిపోకుండా నిరంతరం పని చేస్తుంది.

కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తున్న ఏఐ
నివేదికలోని డేటా కొందరికి ఆందోళన కలిగించినప్పటికీ చాలా మందికి ఏఐ కొత్త అవకాశాలను కూడా సృష్టించనుంది. సర్వీస్‌నౌ నివేదిక ప్రకారం.. ఏఐ టూల్స్‌ను నిర్వహించడం, వాటి పనిని తనిఖీ చేయడం, వాటి సరైన వినియోగాన్ని నిర్ధారించడం కోసం కొత్త నియామకాలు జరగవచ్చు. ఈ కోణంలో చూస్తే ఏఐ కొన్ని ఉద్యోగాలను మింగేస్తున్నప్పటికీ కొత్త అవకాశాలను కూడా కల్పిస్తోందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+