AI డేటా కోర్సులకు ఆన్ లైన్ శిక్షణ, అర్హతలు..!!

ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్ కు ప్రాధాన్యత పెరుగుతోంది. ఎంఎన్సీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఏఐ సేవలు వినియోగిస్తున్నారు. ఏఐ ద్వారా పలువురి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడిందనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఏఐ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. కాగా, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ & డేటా సైన్స్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ అకాడమీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దాదాపు 100 రకాల కోర్సులను రెండు నుంచి 12 నెలల కాలంలో నేర్పించేందుకు శిక్షణ ఇస్తోంది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ అకాడమీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటలి జెన్స్ & డేటా సైన్స్ కోర్సుల తో పాటు 100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇంటర్ పాస్, ఇంజినీరింగ్ , డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చ. నేషనల్ స్కిల్ అకాడమీ విద్యార్థులు సరికొత్త సాఫ్ట్ వేర్ టెక్నాలజీలలో తమ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. దరఖాస్తుదారులు100కి పైగా కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోర్సుల నుండి ఏదేనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు. కోర్సులు ఈ-లెర్నింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ అందిస్తున్నారు.

training-for-artificial-intelligence-and-data-science-courses-by-online-details-here

ఈ శిక్షణలో సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటా సైన్స్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, ఎథికల్ హ్యాకింగ్, పైథాన్, మెషిన్ లెర్నింగ్ మరియు బిజినెస్ అనలిటిక్స్ ఉన్నాయి. అదనపు కోర్సులలో ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్, డీప్ లెర్నింగ్, సెలీనియం, సేల్స్‌ఫోర్స్, జావా, ఒరాకిల్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డిజైన్ కోర్సుల నుండి ఏదైనా కోర్సు ఎంపిక చేసుకోవచ్చు.

పాస్ అయిన విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఆమోదించిన సర్టి ఫికేట్‌ను అందుకుంటారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 12 నెలల వరకు ఉంటుంది. అప్లికే షన్ సమాచారం ఆసక్తి గల అభ్యర్థులు www.nationalskillacademy.in లో ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు ఫోన్: 9505800050 లో సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+