AI: ఇరాన్ పై దాడికి అమెరికా వాడిన ఏఐ టూల్ ఇదే..! వెంటనే ట్రంప్ బ్యాన్..!
ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఆపే లక్ష్యంతో అమెరికా-ఇజ్రాయెల్ నిన్న ఉమ్మడిగా ఆ దేశంపై దాడులు ప్రారంభించాయి. ఒక్క రోజులోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని మట్టుబెట్టాయి. ఆయనతో పాటు రక్షణ మంత్రి, రక్షణ సలహాదారు, ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ ఇలా కీలక నేతలు, అధికారుల్ని చంపేశాయి. అయితే ఇంత కచ్చితంగా ఈ దాడి నిర్వహించడానికి, కీలక నేతల్ని హత్య చేయడానికి అమెరికా వాడిన ఏఐ టూల్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
ఇంతకీ అమెరికా (US) ఇరాన్ (iran) లో దాడులకు వాడిన ఏఐ టూల్ ఏంటో తెలుసా ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ (Anthropic Claude AI). అమెరికా రక్షణ కేంద్రం పెంటగాన్ ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ ని వాడి ఇరాన్ లో లక్ష్యాలను ఆయుధాలతో గురిపెట్టి కచ్చితంగా తమ పని పూర్తి చేసిందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో తెలిపింది. అయితే అనూహ్యంగా ఈ ఆరంభ దాడి తర్వాత ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐ టూల్ ను ఫెడరల్ ఏజెన్సీలు వాడకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించారట.

ఇప్పటికే అమెరికా సైన్యానికి వివిధ స్ధాయిలో ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐతో పాటు ఓపెన్ ఏఐ, గూగుల్, ఎక్స్ ఏఐ వంటి టూల్స్ సాంకేతిక సహకారం అందిస్తున్నాయి. అయితే వీటిలో ఆంత్రోపిక్ ను మాత్రం అమెరికా రక్షణ శాఖతో విభేదాల కారణంగా తాజాగా నిషేధించారు. కానీ ఆ నిషేధం అమల్లోకి రాకముందే ఇరాన్ దాడికి పెంటగానే ఈ టూల్ ను వాడి తమ పని పూర్తి చేసింది. అనంతరం ట్రంప్ దీన్ని ఫెడరల్ ఏజెన్సీలు వాడకుండా నిషేధ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా అంత ఉపయోగపడిన ఆంత్రోపిక్ క్లాడ్ ఏఐను ట్రంప్ వదులుకున్నట్లయింది.












Click it and Unblock the Notifications