ప్రపంచంలో ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉండే దేశం ఏదో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. మారుతున్న జీవనశైలి, సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , డిజిటల్ విధానం.. తదితర మార్పుల కారణంగా చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు. అందులో నెట్ లేదా వైఫై తో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఓ అధ్యయనం ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5.52 బిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో ఇది 67 శాతంతో సమానం. ఇక వీరిలో 95.9 శాతం మంది స్మార్ట్ ఫోన్ ల ద్వారా ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. అలాగే ఓ వ్యక్తి సగటున రోజుకు 6 గంటల 30 నిమిషాల పాటు ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. అయితే ప్రపంచంలో ఇంటర్నెట్ స్పీడ్ వేగంగా ఉండే దేశం ఏదో తెలుసా..?
అయితే తాజా అంచనాల ప్రకారం.. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండే దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) నిలిచింది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ లో ప్రపంచంలో మొదటి స్థానంలో ప్రస్తుతం UAE ఉంది. ఇక్కడ యావరేజ్ గా సెకన్ కు మెగా బైట్ 546 నుంచి 600 వరకు ఇంటర్నెట్ వేగం ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ లిస్టులో ఇక రెండో స్థానంలో ఖతార్ ఉంది. ఖతార్ లో మొబైల్ ఇంటర్నెట్ వేగం 500 నుంచి 517 Mbps వరకు ఉంటందని సమాచారం. అలాగే కువైట్ మూడో స్థానంలో.. బ్రెజిల్ నాలుగు, బహ్రెయిన్ ఐదో స్థానంలో ఉన్నాయి.
ఇక భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోకి 5జీ ఎంటర్ అయిన తర్వాత ఇంటర్నెట్ వినియోగంలో భారత్ దూసుకెళ్తోంది. కొన్నేళ్ల క్రితం కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఇంటర్నెట్ ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి వచ్చింది. ఓ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో 75.9 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నట్లు సమాచారం.

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ ర్యాంకింగ్స్ పరంగా చూస్తే భారత్ చాలా వెనుకబడి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. కేవలం 131 నుంచి 133 ఎంబీపీఎస్ వేగంతో ఈ జాబితాలో 26వ స్థానంలో ఉంది. భవిష్యత్తులో 6జీ కూడా భారత్ లోకి రానున్న క్రమంలో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications