Year Ender 2025: ఈ ఏడాది సత్తా చాటిన ఏఐ టూల్స్ ఇవే..! ట్రైచేశారా ?

కృత్రిమ మేథ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు రేపుతున్న వేళ ఈ ఏడాది పలు ఏఐ టూల్స్ యూజర్ల ఆలోచనా విధానాన్ని మార్చేశాయి. అద్భుతమైన ఫీచర్లతో వారిని ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత యూజర్లే కాదు కంపెనీలు సైతం ఏఐ టూల్స్ వాడకంలో టాప్ గా నిలిచాయి. ఇంకా చెప్పాలంటే వీటిని వాడుకుంటూ ఉద్యోగులకు లేఆఫ్ లు సైతం ఇచ్చేశాయి. ఈ నేపథ్యంలో గత 12 నెలల్లో వివిధ రంగాల్లో దుమ్మురేపిన ఏఐ టూల్స్ ఏంటో ఓసారి చూసేద్దాం...

గోప్యత, సెంట్రలైజ్డ్ కార్యకలాపాల కోసం క్లాడ్ (ఆంత్రోపిక్), సమాచార పునరుద్ధరణ కోసం గ్రోక్ , పెర్ప్లెక్సిటీ వంటి శక్తివంతమైన టూల్స్ ఉపయోగపడ్డాయి. అలాగే కంటెంట్ కోసం జాస్పర్/కాపీ.ఐ, కోడింగ్ కోసం గిట్‌హబ్ కోపైలట్ యూజర్లకు అండగా నిలిచాయి. ఫొటోల కోసం DALL-E/మిడ్‌జర్నీ, ఆటోమేషన్ కోసం జాపియర్, మర్ఫ్ (టెక్స్ట్-టు-స్పీచ్) పనికొచ్చాయి. అలాగే ఫైర్‌ఫ్లైస్ వంటి ప్రత్యేక సాధనాలు సత్తా చాటుకున్నాయి. మల్టీమోడల్ ఏఐ ద్వారా టెక్స్ట్, ఇమేజ్, వీడియోలను తయారు చేసుకోవడం ఈ ఏడాది ట్రెండింగ్ లో నిలిచింది.

Your 2025 AI Toolkit The Top Tools for Productivity and Innovation

వీటిని మరింత నిశితంగా పరిశీలిస్తే.. సాధారణ అవసరాలు, చాట్ బోట్స్ కోసం గూగుల్ జెమిని,క్లాడ్ (ఆంత్రోపిక్), ఎక్స్ గ్రోక్
పర్‌ప్లెక్సిటీ, ఛాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ ముందున్నాయి. అలాగే కంటెంట్ & క్రియేటివ్ అవసరాల కోసం జాస్పర్ ,కాపీ.ఐ,
DALL-E / మిడ్‌జర్న్, ఫ్లికి / పిక్టరీ / గూగుల్ వీయో, మర్ఫ్ / ఎలెవెన్‌ల్యాబ్స్, ప్రొడక్షన్, వ్యాపార అవసరాల కోసం
జాపియర్ వంటివి కూడా పనికొచ్చాయి. అలాగే కోడింగ్ కోసం గిట్ హబ్ కోపైలట్, బోల్ట్ డాట్ న్యూ,కర్సర్, జెట్ బ్రెయిన్స్ AI అసిస్టెంట్ టాప్ లో నిలిచాయి.

Your 2025 AI Toolkit The Top Tools for Productivity and Innovation

వీటితో పాటు జెమినీ ఫొటో ఏఐ టూల్ మల్టీమోడల్ ఏఐగా పనికొచ్చింది. ఇందులోనే టెక్స్ట్, చిత్రాలు , వీడియోలను తయారు చేసుకోవచ్చు. అలాగే క్లాడ్ వంటి వాటిని గోప్యత కోసం డేటా ఎన్‌క్రిప్షన్ కోసం వాడుతున్నారు. మరోవైపు ఏఐ ఏజెంట్లకూ కంపెనీల్లో డిమాండ్ పెరుగుతోందని ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+