'మగవారు గర్భం దాల్చగలరా?'.. సెనేట్‌లో భారత సంతతి డాక్టర్‌ దిమ్మతిరిగే సమాధానం!

అమెరికాలోని జార్జియాకు చెందిన భారత సంతతి గైనకాలజిస్ట్ డాక్టర్ నిషా వర్మ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. అబార్షన్ మాత్రల భద్రతపై అమెరికా సెనేట్ హెల్త్ కమిటీ నిర్వహించిన విచారణలో రిపబ్లికన్ సెనేటర్లు ఆమెను 'బయోలాజికల్ జెండర్' (జీవశాస్త్ర లింగం) గురించి అడిగిన ప్రశ్నలు, దానికి ఆమె చెప్పిన సమాధానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికా సెనేట్‌లో 'ప్రెగ్నెన్సీ' వివాదం?
విచారణ సందర్భంగా రిపబ్లికన్ సెనేటర్ జోష్ హాలీ, డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. "పురుషులు గర్భం దాల్చగలరా?" అని నేరుగా ప్రశ్నించారు. అంతకుముందు మరో సెనేటర్ యాష్లే మూడీ కూడా ఇదే ప్రశ్న వేశారు. దీనికి డాక్టర్ నిషా వర్మ నేరుగా 'అవును' లేదా 'కాదు' అని సమాధానం చెప్పకుండా సంక్లిష్టమైన వివరణ ఇచ్చారు.

Can Men Get Pregnant Indian-Origin Doctor Senate Testimony Goes Viral

డాక్టర్ నిషా వర్మ వివరణ: "మీరు ఈ ప్రశ్నను ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక వైద్యురాలిగా నేను విభిన్న గుర్తింపులు కలిగిన రోగులకు చికిత్స అందిస్తాను. సైన్స్, ఆధారాలు వైద్యానికి మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఇలాంటి 'అవును/కాదు' అనే ప్రశ్నలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నాయి" అని ఆమె పేర్కొన్నారు. దీనిపై సెనేటర్ హాలీ తీవ్రంగా స్పందిస్తూ.. "ఇది కేవలం జీవశాస్త్ర వాస్తవం. పురుషులు గర్భం దాల్చలేరనే ప్రాథమిక వాస్తవాన్ని అంగీకరించని మీ సాక్ష్యాన్ని మేమెలా నమ్మాలి?" అని ప్రశ్నించారు.

ఎవరీ నిషా వర్మ?
నిషా వర్మ అమెరికాలో స్థిరపడిన భారతీయ వలస దంపతులకు నార్త్ కరోలినాలో జన్మించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా నుంచి మెడికల్ డిగ్రీ (MD), ఎమోరీ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) పూర్తి చేశారు.ఆమె అబ్స్టెట్రిక్స్, గైనకాలజీ (OB/GYN)లో డబుల్ బోర్డ్-సర్టిఫైడ్ నిపుణురాలు. ప్రస్తుతం జార్జియాలో రిప్రొడక్టివ్ హెల్త్‌కేర్ ప్రాక్టీషనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే 'అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్' (ACOG)లో సీనియర్ అడ్వైజర్‌గా, ఎమోరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

సోషల్ మీడియాలో చర్చ
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా దీనిపై స్పందిస్తూ, "ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన పరిస్థితి రావడం విడ్డూరం" అని వ్యాఖ్యానించారు. కొందరు ఆమె రోగుల పట్ల చూపే సమ్మిళిత దృక్పథాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు సైన్స్ ఆధారిత విచారణలో ఇలాంటి సమాధానాలు సరికాదని విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+