గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 విజేతలు వీరే..!

ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ను, వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలు, టీవీ షోలు ఇప్పుడు ప్రతిష్ఠాత్మక 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026లో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నాయి. 2025లో విడుదలైన ఉత్తమ చిత్రాలు, నటీనటుల ప్రతిభకు ఈ వేడుక వేదికగా నిలిచింది. ఈ క్రమంలోనే ఎంతో క్రేజ్ ఉన్న ఈ అవార్డుల వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ వేడుకకు నిక్కీ గ్లేజర్ మరోసారి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమం భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కావడం విశేషం.

గోల్డెన్ గ్లోబ్ ఈవెంట్ ఎక్కడ జరిగింది?

83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రదానోత్సవం జనవరి 11న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ఉన్న బెవర్లీ హిల్టన్ హోటల్ వేదికైంది. ప్రపంచ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలు, టీవీ సిరీస్‌లు ఎక్కువ అవార్డులను దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. ఈ వేడుకలో రెడ్ కార్పెట్ ఫ్యాషన్, స్టార్‌ల హాజరు, అవార్డు ప్రసంగాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

83rd-golden-globe-awards-2026-winners-list

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 - ప్రధాన విజేతలు

ఈ ఏడాది అవార్డుల వేడుకలో 'అడాల్సెన్స్' (Adolescence) సిరీస్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు కీలక విభాగాల్లో ఈ సిరీస్ అవార్డులను దక్కించుకుని సంచలనం సృష్టించింది.

  • ఉత్తమ నటుడు (టీవీ సిరీస్): స్టీఫెన్ గ్రాహం - అడాల్సెన్స్
  • ఉత్తమ సహాయ నటుడు (టీవీ సిరీస్): ఓవెన్ కూపర్ - అడాల్సెన్స్
  • ఉత్తమ నటుడు (సినిమా): తిమోతి చాలామెట్ - మార్టీ సుప్రీం
  • ఉత్తమ నటి (సినిమా): రోజీ బిర్న్ - ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ ఐడిడ్ కిక్ యూ
  • ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్ - వన్ బ్యాటిల్ ఆనథర్
  • ఉత్తమ స్క్రీన్‌ప్లే: పాల్ థామస్ ఆండర్సన్ - వన్ బ్యాటిల్ ఆనథర్
  • ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్ - సెంటిమెంట్ వాల్యూ
  • ఉత్తమ సహాయ నటి (సినిమా): టేయానా టేలర్ - వన్ బ్యాటిల్ ఆనథర్
  • ఉత్తమ సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్‌మెంట్: స్పిన్నర్స్
  • ఉత్తమ యానిమేటెడ్ మోషన్ పిక్చర్: K-Pop డీమన్ హంటర్స్

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు సమాన ప్రాధాన్యం దక్కింది. నటన, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, యానిమేషన్ విభాగాల్లో బలమైన పోటీ నెలకొంది. కొత్త తరం నటీనటులు అవార్డులు దక్కించుకోగా.. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు గుర్తింపు లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+