Viral Video : అభిమాని పెళ్లికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో..!
స్టార్ హీరో సూర్య.. తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రజలకు కూడా సుపరిచితులే. తనదైన శైలిలో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక వైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు అగరం ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో అండగా నిలుస్తున్నారు. అందుకే సూర్య వెండితెర పైనే కాకుండా నిజ జీవితంలోనూ మంచి మనసుతో " రియల్ హీరో" గా పేరొందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
అభిమాని పెళ్లిలో సర్ ప్రైజ్ ఎంట్రీ..
అరవింద్ అనే యువకుడు తన వివాహాన్ని భార్య కాజల్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాడు. కాజల్‌కు హీరో సూర్య అంటే ఎనలేని అభిమానం. ఆయన సినిమాలు, వ్యక్తిత్వం అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఈ విషయం తెలిసిన అరవింద్, తన పెళ్లికి సూర్యను ఆహ్వానిస్తూ ప్రయత్నం చేశాడు. దాంతో వారి కోరికను నెరవేర్చారు ఈ స్టార్ హీరో. ఆ పెళ్లి వేడుకలో సడన్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

కాగా పెళ్లి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సూర్య స్వయంగా వెడ్డింగ్ హాల్‌లోకి అడుగుపెట్టారు. తెలుపు రంగు దుస్తులు, కూలింగ్ గ్లాసెస్‌తో చాలా సింపుల్‌గా, నిరాడంబరంగా వేదిక వైపు నడుచుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా తమ మధ్య సూర్యను చూసిన అతిథులు ఫుల్ షాక్ అయ్యారు. దాంతో ఆ క్షణం పెళ్లి మండపం మొత్తం ఆనందోత్సాహాలతో మార్మోగిపోయింది.
అయితే తన ఫేవరెట్ హీరోను కళ్లముందు చూసిన వధువు కాజల్ క్షణాల పాటు నమ్మలేకపోయింది. ముందు షాక్ అయినా.. సూర్యనే చూస్తూ ఆ తర్వాత ఆనందంతో ఎమోషనల్ అయింది. ఆ తర్వాత సూర్య స్వయంగా వధూవరుల దగ్గరకు వెళ్లి వారి చేతులు పట్టుకుని శుభాకాంక్షలు తెలిపారు. నవదంపతులకు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి.. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. స్టార్ హీరో అయినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఒక కుటుంబ సభ్యుడిలా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
• An Unexpected Visit From @Suriya_offl Na Made Bride Happy and Memorable 😍❤️#Karuppu #Suriya47 pic.twitter.com/G8yttRom6r
— Abhimanyu (@Abhimanyu_Offl) December 27, 2025
గతంలోనూ ఇలాంటి సర్‌ప్రైజ్‌లు..
మరోవైపు పలువురు సినీ ప్రముఖులు ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా గతంలోనూ సూర్య పలుమార్లు అభిమానులను ఇలానే సర్‌ప్రైజ్ చేసి.. ఆ క్షణాలను వారి జీవితాల్లో మరపురానివిగా మార్చారు. ఈ వరుస ఘటనలతో అభిమానుల పట్ల ఆయన చూపించే ప్రేమ.. మరింత స్పెషల్ గా నిలబెడుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications