ఇది మేడం మీ ఫ్యాన్స్ కోరుకునేది.. పాన్ ఇండియా మూవీలో బిగ్ బాస్ బ్యూటీ !!
దివి.. తెలుగు సినీ ప్రియులందరికీ ఈ బిగ్ బాస్ బ్యూటీ సుపరిచితురాలే. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2019లో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినా.. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత A1 ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాల్లో నటించింది. అయితే దివి నిజమైన గుర్తింపును తెచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాలిటీ షో అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మకి బిగ్‌బాస్ షోతో స్టార్ లెవల్ క్రేజ్ దక్కింది. ఈ ఫాలోయింగ్ తోనే దివికి వరుస ఆఫర్లు వచ్చాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు మహర్షి, అల్లు అర్జున్ పుష్ప-2 వంటి పెద్ద సినిమాల్లో కూడా అవకాశం దక్కింది.
అంతే కాకుండా కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో నటించింది. సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రంగి సినిమాలో 'జాజిమొగులాలి' ఫోక్ సాంగ్ రీమేక్ చేశారు. ఇందులో దివి చేసిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన నడుము, డ్యాన్స్ మూవ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. ఇటీవల లంబసింగి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ అది పెద్దగా విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ సరైన బ్రేక్ కోసం ఇంకా ఎదురుచూస్తోంది. అందుకే సరైన హిట్ పడితే అమ్మడు తగ్గేదే లే అంటూ ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం దివి మెయిన్ లీడ్ గా పాన్ ఇండియా చిత్రం "కర్మస్థలం" లో నటిస్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ ట్రేడ్ సర్కిల్స్‌లో, సినీ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేసింది. సామ్రాద్ని ఫిల్మ్స్, రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ పోస్టర్ లో దివి చుట్టూ అగ్ని జ్వాలలు.. బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం సహా పలు భాషల్లో విడుదల కానుంది. మరోవైపు దివికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.3 మిలియన్లకుపైగా అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.
-
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ












Click it and Unblock the Notifications