బెడ్ సీన్ అప్పుడు ఏం చేసినా సైలెంట్‌గా ఉండాలి.. నా వల్ల కాదన్నా వినలే !

దివ్య పిళ్లై.. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన మంగళవారం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. సినిమా చివరలో పాయల్ రాజ్ పుత్ ను చంపే హంతకురాలిగా ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఎయిర్‌లైన్ ఉద్యోగం నుంచి వెండి తెరపైకి వచ్చిన దివ్య.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మలయాళ సినిమాలతో ప్రారంభమైన ఆమె కెరీర్.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల మన్ననలను సైతం అందుకుంటోంది.

మలయాళ ఇండస్ట్రీలో తొలి ఎంట్రీ..

దివ్య పిళ్లై 2015లో Ayal Njanalla అనే మలయాళ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమాలో ఫహద్ ఫాసిల్ సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత Oozham, Kalaapuram, Masterpiece, Safe, My Great Grandfather వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. మలయాళ సినీ రంగంలో ఆమెకు మంచి "Graceful Performer"గా పేరొచ్చింది. అలానే తెలుగులో తగ్గేదేలే సినిమాతో ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు. గ్లామర్ రోల్ చేసినప్పటికీ, ఆ పాత్రలో ఉన్న భావోద్వేగం, స్క్రిప్ట్ డిమాండ్ ఆమెను నటిగా ప్రత్యేకంగా నిలబెట్టింది.

ctress-divya-pillai-comments-on-doing-romantic-scenes-goes-viral

అయితే ప్రస్తుత కాలంలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లలో రొమాన్స్ కంటే లిప్‌లాక్, బెడ్‌సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దివ్య పిళ్లై తన అనుభవాలను బహిరంగంగా పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. మలయాళంలో కళాపురుష్ సినిమాలో టోవినో థామస్‌తో నా మొదటి ఇంటిమేట్ సీన్ చేశాను. అందుకు మొదట ఒప్పుకోలేదు కానీ.. కెమెరాలు, లైట్లు, సిబ్బంది మధ్యలో ఉండటం చాలా అసౌకర్యంగా అనిపించింది. కానీ అలాంటి సీన్స్ చేసేప్పుడు దర్శకుడు కట్ చెప్పేవరకు నటించాల్సిందే. ఆ సమయంలో మనసులో ఎంత టెన్షన్ ఉన్నా ముఖంలో చూపించకూడదు అని చెప్పారు.

మరి ముఖ్యంగా ఆ సీన్ చేసేటప్పుడు 80 కేజీల బరువున్న సహనటుడు నాపై పడుకుని ఉన్నప్పుడు కూడా.. కెమెరా యాంగిల్‌కు సరిపోయే ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి. ఆ సమయంలో మనకు ఇబ్బంది అయినా చూపించకూడదు. లిప్‌లాక్ లేదా బెడ్‌సీన్‌లో నటిస్తున్నప్పుడు ఆ భావం ముఖంలో కనిపిస్తే, అది ఫేక్ గా అనిపిస్తుందన్నారు. ప్రేక్షకుడు చూస్తున్నప్పుడు అది నమ్మదగినట్టుగా ఉండాలని దివ్య చెప్పుకొచ్చారు. కానీ స్క్రిప్ట్ డిమాండ్ ఉన్నప్పుడే గ్లామర్ రోల్స్‌ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మైన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ctress-divya-pillai-comments-on-doing-romantic-scenes-goes-viral

రీసెంట్ గానే బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం సినిమాలో నటించి మెప్పించారు. అంతకు ముందు నాగ చైతన్య - సాయి పల్లవి సూపర్ హిట్ మూవీ "తండేల్" మూవీలో కూడా ముఖ్యపాత్రలో అదరగొట్టారు. ప్రస్తుతం దివ్య పిళ్లై రెండు మలయాళ చిత్రాలు, ఒక తెలుగు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ప్రేక్షకులను ఎంతమేర అలరిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+