డ్రాగన్ బ్యూటీకి గోల్డెన్ ఆఫర్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ.. ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. 2026 మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు, సొనాలి కులకర్ణి, రాఘవ్ జుయెల్, తణికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తోన్నారు. కమేడియన్ గా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఇందులో బిర్యానీ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నారు.
ఇదివరకు నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2023 విడుదలైన ఈ సినిమా నాని కేరీర్ లో ఓ బ్లాక్ బస్టర్. 120 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందా ఫిల్మ్. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ది ప్యారడైజ్ రాబోతోంది. ఇదివరకు నాని ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. రెండు రోజుల కిందటే సంపూర్ణేష్ బాబును ఫస్ట్ లుక్ కూడా వెలుగులోకి వచ్చింది. 'బిర్యానీ' పాత్రలో రక్తసిక్తమైన అవతారంలో కనిపించాడిందులో.

తాజాగా మరో అప్ డేట్ వెలువడింది ప్యారడైజ్ మూవీపై. ఇందులో కాయదు లోహర్ ఓ కీలక పాత్రకు ఎంపికైంది. ఈ విషయాన్ని యూనిట్ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కాయదు లోహర్ పై ఫొటో షూట్ కూడా పూర్తయిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఒకట్రెండు రోజుల్లో ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల కావొచ్చని తెలుస్తోంది. అల్లూరి సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది కాయదు. తమిళం, కన్నడ సినిమాల్లో సైతం అరంగేట్రం చేసింది. ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన డ్రాగన్ తో మంచి గుర్తింపు లభించింది.
తెలుగులో ప్యారడైజ్ తో పాటు ఫంకీలోనూ నటిస్తోంది. ఏకకాలంలో పలు సినిమాలకు సైన్ చేసింది. ఇధయం మురళి, ఇమ్మోర్టల్, అరసన్, తరమ్ సినిమాల్లో నటిస్తోంది. ఇధయం మురళీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications