లక్కీ స్టార్.. గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌కి జోడీగా కన్నడ హీరోయిన్ !

"రుక్మిణీ వసంత్".. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అలానే "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి పెద్దగా విజయం పొందలేకపోయాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి", రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు.

actress-rukmini-vasanth-may-act-in-sukumar-and-ram-charan-movie

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కూడా ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్‌లో ఆమె పాల్గొన్నట్టు సమాచారం. అలానే ఈ మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు అనుకుంటున్నారు. మేకర్స్ కూడా ఆమె క్రేజ్, యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని అడిగినంత పారితోషికాన్ని ఇస్తున్నారని టాక్.

అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలో రుక్మిణి ను హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 2026 సమ్మర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో "పెద్ది" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ మూవీ పూర్తైన తర్వాత సుకుమార్ ‌డైరెక్షన్ లో నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని.. ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'రంగస్థలం' ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో.. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకున్నాయి.

కాగా గతంలో ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ.. రుక్మిణి వసంత్ తనకు ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, వారితో కలిసి నటించాలనేది తన కల అని చెప్పింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తుండడంతో.. ఆమె కల నెరవేరిందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ లతో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడంతో త్వరలోనే స్టార్ హీరోయిన్ అవుతుందని చర్చ నడుస్తోంది.

actress-rukmini-vasanth-may-act-in-sukumar-and-ram-charan-movie
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+