రజినీకాంత్ కోసం ఏడు రోజులు ఉపవాసం ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్.. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. రీసెంట్ గానే లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.

ఇక ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్ 2. రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. 600 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. తెలుగులోనూ దాదాపు 90 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి అదరగొట్టారు. ఇప్పుడు ఈ సీక్వెల్ లో విజయ్ సేతుపతి, ఎస్.జె. సూర్య వంటి నటులు కూడా నటిస్తున్నారని సమాచారం. 2026 సమ్మర్‌లో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.

actress-sridevi-7-days-fasting-for-super-star-rajini-kanth-for-speed-recovery

కాగా ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈరోజు (డిసెంబర్ 12న) ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు రజినీకాంత్ కోసం ఏకంగా 7 రోజులు ఉపవాసం ఉన్నారట. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

రజినీ - శ్రీదేవి కాంబో..

అతిలోక సుందరి శ్రీదేవి.. తెలుగు, తమిళ, హిందీ సహా పలు భాషల్లో నటించి స్టార్ బ్యూటీగా ఎదిగారు. శ్రీదేవి చిన్న వయసులోనే నటనను ప్రారంభించి.. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి, నాగార్జున వంటి లెజెండ్స్‌తో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. శ్రీదేవి తెలుగులో నటించిన చివరి చిత్రం 'ఎస్.పి. పరశురాం' (1994). ఆ తర్వాత బాలీవు‌లో 'జుదాయ్', 'లమ్హే', 'ఇంగ్లీష్ వింగ్లీష్', 'మామ్‌' వంటి చిత్రాలలో మెప్పించారు.

స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్ లో సినీ పరిశ్రమలో పలువురు స్టార్స్ స్నేహితులుగా కొనసాగారు. అందులో శ్రీదేవి, రజినీ సైతం మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు. అయితే ఒక సమయంలో రజినీకాంత్ అనారోగ్యంతో ఉన్నప్పుడు.. ఆయన కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపవాసం ఉన్నారట. ఈ విషయాన్ని వారి సన్నిహితులు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+