పెద్దిని ఢీ కొట్టడం అంటే మాటలా
నేడు అక్కినేని అఖిల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రం నుంచి మరో కొత్త పోస్టర్ విడుదల అయింది. ఈ బర్త్‌డే పోస్టర్‌లో అఖిల్ టైటిల్ పాత్రలో గ్రామీణ నేపథ్యం ఉన్న కుర్రాడిగా అభిమానులను ఆకట్టుకున్నాడు. రఫ్ అండ్ టఫ్ అవతారంలో పూర్తిగా న్యూ లుక్ లో దర్శనం ఇచ్చాడు. ఓ చేతిలో జెండా, మరో చేతిలో మట్టిని పట్టుకుని, సాదాసీదా దుస్తులతో ఉన్న అఖిల గెటప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చిత్తూరు ప్రాంతానికి చెందిన ఓ పవర్ ఫుల్ భూమి పుత్రుడి క్యారెక్టర్ ను పోషిస్తోన్నాడీ మూవీలో అఖిల్. ఓ పూర్తిస్థాయి గ్రామీణ పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోస్టర్‌లో సినిమా విడుదల తేదీని కూడా స్పష్టంగా ప్రకటించింది యూనిట్. జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందీ మూవీ. వేసవి సెలవుల నేపథ్యంలో మే 1వ తేదీన విడుదల చేయాలని ఇదివరకు నిర్ణయించుకున్నప్పటికెీ అది వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 26 తేదీ ఖరారైంది.

అదే రోజు రామ్ చరణ్- జాన్వీ కపూర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ పెద్ది కూడా విడుదలయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు ఉన్నప్పటికీ లెనిన్ నిర్మాతలు మాత్రం తమ నిర్ణయంపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తోన్నారు. కథాబలం, స్టార్ క్యాస్టింగ్, పైగా మొదటిసారిగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో అఖిల్ నటిస్తోండటం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఫిల్మ్ కావడం వల్ల సక్సెస్ గ్యారంటీ అని నమ్ముతున్నారు.
మురళి కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. లెనిన్ సినిమా ప్రతి భావోద్వేగంతో నిండిన పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుందని నిర్మాతలు స్పష్టం చేశారు.
Wishing the man of fire and finesse @AkhilAkkineni8 a very Happy Birthday 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) April 8, 2026
Mark your calendars #LENIN will be a celebration in every aspect ❤️🔥❤️🔥#HBDAkhilAkkineni#LeninOnJune26th #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @musicthaman @KishoreAbburu @NavinNooli @artkolla… pic.twitter.com/45cpRC8gcc
మరోవైపు సానా బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో పెద్ది తెరకెక్కుతోంది. ఇది కూడా రూరల్, స్పోర్స్ట్ బ్యాక్ గ్రౌండ్ యాక్షన్ ఎంటర్టైనరే. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, జగపతి బాబు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి దీనిని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications