అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. తాత అవుతున్న కింగ్ "నాగార్జున" !!

అక్కినేని ఫ్యామిలిలో మరో శుభ పరిణామం చోటు చేసుకుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా నాగ చైతన్య - శోభిత, అఖిల్ - జైనాబ్ వివాహాలు అంగరంగ వైభవంగా జరగగా.. ప్రస్తుతం నాగార్జునతో పాటు చైతూ, అఖిల్ ఎవరి సినిమాల్లో వారు నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇప్పుడు వీరి కుటుంబంలో మరో ఆనందకరమైన విషయం జరిగిందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

నాగార్జున రివీల్ చేసినట్టేనా..?

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఒక హెల్త్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జునకు ఈ ప్రశ్న ఎదురైంది. మీరు తాత గా ప్రమోట్ అవుతున్నారట కదా.. నిజమేనా? అని మీడియా అడగగా.. అందుకు నాగార్జున ఆసక్తికర సమాధానం ఇవ్వడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. అందుకు నాగ్ మాట్లాడుతూ.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటూ దాటవేశారు. దాంతో నాగార్జున ఈ వార్తలను ఖండించకపోవడంతో.. అక్కినేని ఇంట్లో త్వరలోనే వారసుడు లేదా వారసురాలు అడుగుపెట్టబోతున్నారనేది నిజమేనని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

akkineni-nagarjuna-shocking-answer-to-becoming-grand-father

అలానే తాను గత 15 ఏళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పితో బాధ పడుతున్నట్లు నాగార్జున రివీల్ చేశారు. సర్జరీ చేయించుకోవడం ఇష్టం లేక, లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్, పీఆర్‌పీ (PRP) చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. నొప్పి ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఉదయం క్రమం తప్పకుండా మోకాలి కోసం వ్యాయామం చేస్తానని అది అస్సలు మిస్ అవ్వదని వెల్లడించారు. 60 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపించే నాగార్జునకు క్రమశిక్షణే హెల్త్ సీక్రెట్ ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు నాగచైతన్య - శోభిత వివాహం చేసుకొని ఏడాది పూర్తవుతుంది. దీంతో వీరిద్దరూ త్వరలోనే తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారని టాక్ వినిపిస్తుంది. మరి అసలు విషయం ఏమిటో మరికొద్ది రోజుల్లో నాగార్జునే స్వయంగా బయటపెడతారని ఆసక్తి నెలకొంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే.. నాగార్జున రీసెంట్ గానే కుభేర, కూలీ సినిమాలతో అలరించారు. నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దర్శకత్వంలో "వృషకర్మ" అనే సినిమా చేస్తున్నారు. అఖిల్ కూడా మురళీ కే కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో "లెనిన్" అనే మూవీ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+