కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అల్లు సినిమాస్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనిపై అల్లు సినిమాస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డాల్బీ సినిమా స్క్రీన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాస్ ప్రారంభ తేదీని అధికారికంగా ఖరారు చేసింది. ఎక్స్‌పీరియన్స్ ది ఎక్స్‌ట్రార్డినరీ అనే ట్యాగ్‌లైన్‌తో యాజమాన్యం లాంచ్ కాబోతోంది. ఇన్ని రోజుల హైదరాబాద్ నగర సినిమా ప్రియుల ఎగ్జయిట్మెంట్ కు ఈ అనౌన్స్ మెంట్ తెరదించింది.

అత్యాధునిక సాంకేతికతతో కోకాపేట్ లో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ఐకన్ స్టార్ అల్లు అర్జున్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నగర మేయర్ హాజరు కానున్నారు. రాజకీయ, సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖలు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

Allu Cinemas Set to Debut as India Most Advanced Dolby Cinema screen Multiplex in Hyderabad Kokapet

దేశంలో మూడో అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఇది. హైదరాబాద్‌లో మొదటిది. ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నందున థియేటర్ యాజమాన్యం ట్రయల్ రన్ చేపట్టనుంది. అంతా సజావుగా సాగడానికి అవసరమైన సాంకేతిక పరీక్షలను నిర్వహించనుంది. ట్రయల్ రన్ లో బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ 1 తొలి సినిమాగా ప్రదర్శితం అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్స్ సజావుగా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానకే ఈ ట్రయల్ రన్.

సినిమా ప్రారంభం తర్వాత కూడా మరికొంతకాలం పాటు ట్రయల్ స్క్రీనింగ్‌ కొనసాగుతుంది. వారం రోజుల పాటు అంటే 12 నుండి 18వ తేదీ వరకు ట్రయల్ రన్ జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాతే సాధారణ ప్రేక్షకుల కోసం టికెట్ బుకింగ్‌లు మొదలవుతాయి. కమర్షియల్ ఆపరేషన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మల్టీప్లెక్స్ లో ధూరంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రదర్శిస్తారు. వీటితో థియేటర్ మొదలవుతుంది.

అల్లు సినిమాస్‌లోని డాల్బీ సినిమా స్క్రీన్ ఆసియాలో అతిపెద్దది. హైదరాబాద్‌కు మొదటిది. డ్యూయల్ డాల్బీ విజన్ 4కే ప్రొజెక్టర్లు, స్టూడియో-గ్రేడ్ డాల్బీ అట్మాస్ సౌండ్‌తో 75 అడుగుల డీసీ ఫ్లాట్ రేషియో గల మెయిన్ స్క్రీన్, 4 ఇమ్మర్సివ్ డిజైన్ స్క్రీన్లు ఈ మల్టీప్లెక్స్ లో ఉన్నాయి.డాల్బీ సినిమా స్క్రీన్ 1 సీట్ల సామర్థ్యం.. 644. ఇందులో ఇదే మెయిన్ స్క్రీన్ కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+