తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు

తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధికంగా 100 రోజులు ఆడి రికార్డులు సృష్టించిన సినిమాల గురించి మాట్లాడుకుంటే, ప్రధానంగా ఇద్దరు దిగ్గజాల పేర్లు వినిపిస్తాయి. అందులో ఒకరు నందమూరి తారకరామారావు కాగా, మరొకరు అక్కినేని నాగేశ్వరరావు. వీరి తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి నిలుస్తారు. తెలుగు సినిమా తొలితరం కథానాయకులలో ఒకరైన ఎన్టీఆర్ తిరుగులేని రికార్డులను సృష్టించారు. ఆయన నటించిన చిత్రాలలో సుమారు 100కి పైగా సినిమాలు 100 రోజులు ఆడాయి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాల్లో 80కిపైగా సినిమాలు 100 రోజులు ఆడాయి.

ప్రేమకథా చిత్రాల్లో అక్కినేని రికార్డు

సాంఘిక చిత్రాల్లో, ప్రేమ కథా చిత్రాల్లో అక్కినేని లెక్కలేన్ని రికార్డులు సృష్టించారు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు కూడా 70కి పైగా 100 రోజులు ఆడాయి. చిరంజీవి నటించిన చిత్రాలలో దాదాపు 50కి పైగా సినిమాలు నేరుగా 100 రోజులు ప్రదర్శితమయ్యాయి. నందమూరి బాలకృష్ణ సినిమాలు కూడా ప్రస్తుతం 55 వరకు 100 రోజులకు పైగా ఆడాయి. ప్రస్తుత తరంలో హీరోల సినిమాలు నేరుగా థియేటర్లలో 2 వారాలకు మించి ప్రదర్శించడంలేదు. ఎందుకంటే అత్యధిక సంఖ్యలో విడుదల చేసి, కలెక్షన్నింటినీ వారానికే రాబడుతున్నారు. దీంతో ఈరోజుల్లో సినిమాలు 50 రోజులు ఆడటమే గగనమైపోయింది. అలాంటిది 100 రోజులు అనేది ఇక కల అని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది హీరోలు పట్టుబట్టి థియేటర్లలో 100 రోజులు ఆడించడమేకానీ సాధారణంగా అయితే అది జరగడంలేదు

Among Telugu films that have completed 100day theatrical run this actor holds record for highest number

చూడనివారికి ఓటీటీ ఉందిగా

మరికొన్ని ప్రాంతాల్లో అభిమానులు కూడా తమ హీరో సినిమాలకు తామే టికెట్లు కొని 100 రోజుల నుంచి 200 రోజుల వరకు ఆడిస్తున్నారు. బాగా సూపర్ హిట్ అయిన సినిమాల వరకే ఇలా జరుగుతోంది. ప్రస్తుత తరం హీరోలు మాత్రం కలెక్షన్లపై దృష్టిపెట్టారు. ఎక్కువ థియేటర్లలో ఒకేసారి విడుదల చేయడంవల్ల వేగంగా సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగివస్తోంది. సినిమా బాగుంటే నిర్మాత సేఫ్ గా ఉంటారు. ఎక్కువ రోజులు వేచిచూసే పనిలేకుండా వెంటనే జరిగిపోతోంది. దాంతో విడుదలయ్యే అన్ని సినిమాలు రెండు వారాలకు, మూడు వారాలకు, మహా అయితే నెలరోజులు థియేటర్లలో ఆడి తర్వాత ఎగిరిపోతున్నాయి. చూడనివారు ఓటీటీల్లో చూసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+