అనసూయపై మీకెందుకురా అంత కక్ష ..!

యాంకర్ అనసూయ అంటే కేవలం ఒక టీవీ యాంకర్ కాదు, ఆమె ఒక ట్రెండ్ సెట్టర్. బుల్లితెరపై తన మాటలతో, అద్భుతమైన డ్రెస్సింగ్‌ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది. 'జబర్దస్త్' షోతో ఆమె సంపాదించిన క్రేజ్ అపారం. ఆ తర్వాత సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అనసూయ కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు, నటనలోనూ తన ప్రతిభను చాటుకుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'క్షణం', 'పుష్ప', 'యాత్ర' 'దర్జా','విమానం','పెదకాపు-1','ప్రేమ విమానం' ,'రజాకార్' వంటి సినిమాలలో విలక్షణమైన పాత్రలు పోషించి, ఒక నటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ తర్వాత యాంకర్‌గా , హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే..అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం , అభినయం రెండు ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతున్నారామె. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికి తెలిసిందే.

Anasuya s Vacation Video Misused Fans Slam Cyber Miscreants for Obscene Edits

తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటరిస్తుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. అనసూయ ఏం చేసిన కూడా సంచలనమే అన్నట్టుగా ఉంటోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. గ్లామర్‌గా కనిపించడానికి అనసూయ తెగ కష్టపడుతుంటుంది. ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉంటే తాజాగా అనసూయ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో అనసూయ తన భర్తతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా భర్తతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలు , వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలను కొందరు దుర్మార్గులు అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.ఇది చూసిన అనసూయ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలను చేయడానికి సిగ్గు, శరం ఉండాలంటూ తిడుతున్నారు. మరికొందరు మీ ఇంట్లో ఆడవారు లేరా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+