అక్కినేని హీరో కోసం రీ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏఎన్నార్ వారసుడిగా వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటే.. ఆయన లెగసీని కొనసాగిస్తూ నాగ చైతన్య, అఖిల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అఖిల్ విషయానికి వస్తే.. 2015లో 'అఖిల్' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఫిజికల్ ఫిట్‌నెస్, డాన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.
ఆ తర్వాత 2017లో వచ్చిన 'హలో' సినిమా అఖిల్‌కు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. అఖిల్ నటనలో మెచ్యూరిటీ కనిపించిందని విమర్శకులు నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత 2019 లో రిలీజ్ అయిన 'మిస్టర్ మజ్ను' చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో కనిపించినా హిట్ అందుకోలేకపోయారు. అనంతరం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' (2021) సినిమా అఖిల్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. కమర్షియల్‌గా విజయం సాధించిన ఈ సినిమా ద్వారా అఖిల్‌కు బాక్సాఫీస్ హిట్ అందించింది.

ఇక 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఏజెంట్' సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. మొత్తానికి పదేళ్లలో ఐదు సినిమాలు చేసినా సరిగ్గా ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే దాదాపు రెండేళ్ల పాటు విరామం తీసుకున్న అఖిల్.. ఇప్పుడు 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళీ కే కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మొదట శ్రీలీలను ఒకే చేయగా.. కొన్ని కారణాలతో ఆమె స్థానంలో భాగ్యశ్రీని ఫైనల్ చేశారు.
బాలీవుడ్ బ్యూటీ రీ ఎంట్రీ..
కాగా ఈ మూవీలో అఖిల్‌ను మాస్ యాంగిల్ లో చూపించనున్నట్టు తెలుస్తోంది. డీ-గ్లామర్ లుక్‌లో ఆయనకు సంబంధించిన పోస్టర్స్, వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పాట కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండేను రంగంలోకి దించుతున్నట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఆమె ఒక గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇవ్వనుందని అంటున్నారు.

మరోవైపు విజయ్ దేవరకొండతో కలిసి ఆమె 'లైగర్' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం భారీ పరాజయాన్ని మూటగట్టు కోవడంతో మళ్లీ తెలుగులో మరో సినిమాకు కమిట్ అవ్వలేదు. మరి అఖిల్ మూవీతో అయిన అయ్యగారికి ఒక హిట్.. అనన్యకు తెలుగులో ఛాన్సులు రావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇందుకు సంబంధించి పోస్టులు పెడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications