ప్రశాంత్ నీల్ స్కెచ్ మామూలుగా లేదుగా.. ఎన్టీఆర్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ వైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు. సుమారుగా 18 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయకపోయినా.. ఈ సినిమా టైటిల్ "డ్రాగన్" అంటూ ప్రచారం నడుస్తోంది.

ఇక కొంతకాలంగా ఈ మూవీ షూటింగ్ కు చిత్రబృందం బ్రేక్ ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత ఇటీవల షూటింగ్ తిరిగి స్టార్ట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో నైట్ షెడ్యూల్ జరుగుతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తన గత చిత్రం "KGF" లో బాలీవుడ్ నటి రవీనా టండన్ ను కీలకపాత్రలో పవర్ఫుల్ గా చూపించారు. దీంతో మళ్లీ ఈ సినిమా కోసం కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దించుతున్నారట ప్రశాంత్.
ఆమె ఎవరంటే..?
బాలీవుడ్ ఒకప్పటి టాప్ హీరోయిన్ కాజోల్.. ఎన్టీఆర్ - నీల్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. లేటస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం కాజోల్ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌కు తల్లిగా కనిపించనుందని అనుకుంటున్నారు. దీంతో ఇది ఆమెకు కెరీర్‌లో మరో డిఫరెంట్, పవర్‌ఫుల్ పాత్రగా నిలుస్తుందండనడంలో సందేహం లేదు. అలానే ఎన్టీఆర్ దేవర మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ముఖ్య పాత్ర పోషించగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించి మెప్పించారు.

-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications