ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు

'పొరుగింటి పుల్లకూర రుచి' అన్న సామెత తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి నిజమైంది. బాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' చూసి మన టాలీవుడ్ స్టార్ హీరోలు మురిసిపోతున్నారు. ప్రశంసలు కురిపిస్తున్నారు. అదేదో అద్భుతమని, ఆకాశం నుంచి, వేరే గ్రహం నుంచి దిగివచ్చినట్లుగా అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఆ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ మేకింగ్‌ను, ఆ సినిమాలోని యాక్షన్‌ను ఆకాశానికి ఎత్తుతూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో తమ తోటి హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదలైనప్పుడు మాత్రం ఒక్క స్టార్ హీరో కూడా కనీసం స్పందించలేదు. అంటే వీరంతా కేవలం 'భజన'కే పరిమితమయ్యారా? అనిపిస్తోంది.

అదిరిపోయిందంటూ కితాబులు

'ధురంధర్2' పై మన టాలీవుడ్ హీరోలు ఏమన్నారంటే.. ఈ చిత్రాన్ని ఖచ్చితత్వంతో కూడిన విస్ఫోటనం అని వర్ణిస్తూ మహేష్ బాబు ఈ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సొంత థియేటర్లలో మొదటి రోజే ఈ సినిమాను చూసి మేకింగ్ వాల్యూస్ అదిరిపోయాయంటూ కితాబిచ్చారు. ఈ సినిమాను ఒక 'బ్లాస్టింగ్ ఎక్స్‌పీరియన్స్' అని రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి యువ హీరోలు కూడా అభివర్ణించారు. దర్శకుడి ప్రతిభను కొనియాడారు.

Dhurandhar2 is Superb Our tollywood Heroes didnt Utter a Word About ustaad bhagat singh Movie

రాజకీయ సమీకరణాలు అడ్డుపడుతున్నాయా?

అన్యభాషా చిత్రాలను ప్రోత్సహించడం మంచిదే, కానీ సొంత ఇండస్ట్రీకి చెందిన పెద్ద సినిమాపై మౌనం పాటించడం, కనీసం నోరు తెరిచి మాట్లాడకుండా ఉండటం సినీ ప్రియులను కలిచివేస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం విడుదలైనప్పుడు టాలీవుడ్ పెద్దలెవరూ సోషల్ మీడియా వేదికగా ఒక్కరు కూడా విష్ చేయలేదు. అదే సమయంలో ధురంధర్ 2ను పొగిడేందుకు మాత్రం ఒకర్ని మించి మరొకరు పోటీపడ్డారు. వీరంతా పవన్ సినిమా విషయంలో ఎందుకు స్పందించడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. బాలీవుడ్ సినిమాలకు ఇచ్చే బిల్డప్, మన స్టార్ హీరోల సినిమాలకు ఇవ్వకపోవడం 'పొరుగు ఇండస్ట్రీ' మోజును స్పష్టం చేస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

అదే తమిళనాడులోకానీ, కర్ణాటకలోకానీ హీరోలైనా, అభిమానులైనా ఇలా వ్యవహరిస్తారా? వారి సొంత హీరోలకే ప్రాధాన్యతనిస్తారు. "బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ కనిపిస్తున్నాడు కానీ, మన పవన్ కల్యాణ్ కష్టపడి తీసిన సినిమా కనిపించడం లేదా?" అంటూ పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో ఐక్యత కేవలం మాటలకే పరిమితమా? లేక రాజకీయ సమీకరణాలేమైనా అడ్డు పడుతున్నాయా? అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+