Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్
తెలుగు తెరపై తొలి సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతోంది. దీని ఫస్ట్ లుక్ విడుదలైంది.. ఆకట్టుకుంది. దర్శకుడు మరెవరో కాదు. గతంలో ఉప్పెన, విరూపాక్ష, థండేల్ చిత్రాలకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన షామ్‌దత్. తాజాగా డోంట్ స్లీప్ అనే వినూత్న సైకలాజికల్ థ్రిల్లర్‌తో తెలుగు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. చౌర్య పాఠంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇంద్ర రామ్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
డోంట్ స్లీప్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. ఈ పోస్టర్ టోన్ ఆలోచింపజేసేదిలా కనిపించింది. పోస్టర్‌లో మంచు పర్వతాలపై భయానక ఛేజింగ్ ఇందులో చూడొచ్చు. ఇంద్ర రామ్ కళ్లు మూసుకుని, తలకు బ్యాండేజీతో ఉండగా, రవీంద్ర విజయ్ చేతిలో గన్‌తో వెంబడిస్తున్నాడు. ఈ దృశ్యం విచ్ఛిన్నమైన జ్ఞాపకాలు, భయం, వాస్తవం-భ్రమ మధ్య గందరగోళానికి అద్దం పట్టింది. కళ్లు మూసుకుంటే ఇటువంటి జ్ఞాపకాలు హీరో పాత్రధారిని వెంటాడుతాయనిపించేలా పోస్టర్ రూపుదిద్దుకుంది.

వీ చూడామణి, వీ డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ థ్రిల్లర్ నిర్మితమవుతోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ కూడా షామ్ దత్తే. దర్శకుడే కెమెరామెన్ కావడంతో డోంట్ స్లీప్ ఉత్కంఠభరిత, అద్భుతమైన దృశ్యాలతో కూడిన ఈ చిత్రంగా తెరకెక్కే అవకాశాలు లేకపోలేదు. సినిమాటోగ్రాఫర్ గా అపారమైన అనుభవం ఉంది షామ్ దత్ కు. 2004లో ప్రేమాయనమఃతో సినిమాటోగ్రాఫర్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఉత్తమ విలన్, విశ్వరూపం 2 మల్టీ లింగ్వల్ ఫిల్మ్మ్ కు కెమెరా హ్యాండిల్ చేశాడు.
శ్రీదేవి సోడా సెంటర్, రంగరంగా వైభవంగా, మ్యాడ్ స్క్వేర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పుష్ప: ది రైజ్' ఫేమ్ మోనిక రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్ గా వ్యవహరిస్తోన్నారు. గోకుల్ హర్షన్ సంగీతం అందిస్తున్నాడు. ఈయన ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో మరో ప్రాజెక్ట్‌కు కూడా స్వరాలు సమకూరుస్తున్నాడు. ఆర్డీఎక్స్, దుల్కర్ సల్మాన్ నటించిన ఐ యామ్ గేమ్ చిత్రాలకు పని చేసిన సజీర్, లూనా ఈ చిత్ర కథను అందించారు.












Click it and Unblock the Notifications