Movierulzను టచ్ చేయగలరా..?

ఒకప్పుడు సినిమా ప్రేక్షకులకు 'ఉచిత వినోదం' అందిస్తూ, ఓటీటీ సంస్థలకు, చిత్ర పరిశ్రమకు సవాలు విసిరిన అతిపెద్ద పైరసీ సామ్రాజ్యం 'ఐబొమ్మ'. ఇంటర్నెట్ లోకం నుంచి దాన్ని చేధించడం అసాధ్యం అనుకున్నారంతా. 'దమ్ముంటే పట్టుకోండి' అంటూ ఏకంగా పోలీసులకే సవాల్ విసిరాడు ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు. కానీ, తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఆ సవాల్‌ను స్వీకరించి, కరేబియన్ దీవుల్లో దాగి ఉన్న ఆ పైరసీ సామ్రాజ్యానికి తాళం వేయించారు.

సంచలనాత్మక పైరసీ వెబ్‌సైట్లుగా పేరుగాంచిన ఐబొమ్మ (iBomma) , బప్పం టీవీ (Bappam TV) లపై తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ వెబ్‌సైట్‌ల నిర్వాహకుడు, ఇమ్మడి రవిని శనివారం అరెస్టు చేసి, అతిపెద్ద ట్విస్ట్ ఇచ్చారు. రవిని అరెస్టు చేసిన తరువాత, అతనితోనే వెబ్‌సైట్‌లను శాశ్వతంగా మూసివేయించడం జరిగింది. రవి వద్ద స్వాధీనం చేసుకున్న లాగిన్స్ ,సర్వర్ వివరాలను ఉపయోగించి ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్లను పోలీసులు అధికారికంగా క్లోజ్ చేయించారు.

iBomma Bappam TV Shut Down After Kingpin Ravi s Arrest Movierulz Next Target

పోలీసులు ఇమ్మడి రవి నుంచి వందల సంఖ్యలో హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డిస్క్‌లలోని సమాచారాన్ని ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారు, ఆర్ధిక లావాదేవీలు ఎలా జరిగాయి అనే వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

అయితే ఇప్పుడు అందరి కళ్లు మూవీ రూల్స్‌(Movierulz)పై పడ్డాయి. iBomma కంటే ముందు నుంచే మూవీ రూల్స్‌(Movierulz) వెబ్‌సైట్ రన్ అవుతోంది. పైరసీ సినిమాలను ప్రేక్షకులకు మొదటగా అలవాటు చేసింది ఈ వెబ్‌సైటే. ఆ తర్వాతే iBomma పుట్టుకొచ్చింది. . iBomma వెలుగులోకి వచ్చిన తర్వాత మూవీ రూల్స్‌(Movierulz) హవా కాస్తా తగ్గింది.అయినప్పటికీ కొత్త సినిమాలు రిలీజ్ అయిన గంటల్లోనే మూవీ రూల్స్‌(Movierulz)లో ప్రత్యక్షం అవుతున్నాయి...ఇప్పటికీ అవుతున్నాయి కూడా.

ఐబొమ్మను క్లోజ్ చేసిన పోలీసులు..మూవీ రూల్స్‌(Movierulz)ను టచ్ చేయగలుగుతారా అన్నది ఇక్కడ అసలు ప్రశ్న. ఎందుకంటే గతంలో మూవీ రూల్స్‌(Movierulz)ను క్లోజ్ చేయాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. సర్వర్ల ఐపిని మారుస్తూ పోలీసులకు చిక్కకుండా చాలా తెలివిగా తప్పించుకుంటున్నాడు మూవీ రూల్స్‌(Movierulz) అధిపతి. కానీ ఇప్పుడు iBomma రవి అరెస్ట్ కావడంతో ఇప్పుడు అందరి కళ్లు మూవీ రూల్స్‌(Movierulz)పైనే పడ్డాయి. మరి మూవీ రూల్స్‌(Movierulz) విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+