Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్‌కు వెల్లువెత్తుతున్న సపోర్ట్.. అన్యాయం జరిగిందా ???
ప్రముఖ రియాలిటీ షో "బిగ్‌బాస్" 9వ సీజన్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. 105 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ షో లో.. కళ్యాణ్ పడాల విజేతగా నిలిచారు. రన్నర్ గా కన్నడ బ్యూటీ తనూజ నిలిచింది. అయితే విన్నర్ గా కళ్యాణ్ పడాల 35 లక్షలతో పాటుగా ఒక కారును, మరో ఐదు లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. తనూజ సైతం విన్నర్ ప్రైజ్ మనీకి ఏ మాత్రం తగ్గకుండా సంపాదించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలానే డీమాన్ పవన్ సైతం 15 లక్షలు దక్కించుకున్నారు.
అయితే ఆడియన్స్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది మాత్రం ఇమ్మానుయేల్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. నిజానికి ఓటింగ్ ప్రకారం అతను టాప్ 3లో ఉండాలని.. కానీ టాప్ 4లో ఎలిమినేట్ అయ్యాడంటూ ఫీల్ అవుతున్నారు. అంతే కాకుండా ఇమ్మూది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అతనికి నటి రోహిణి, గెటప్ శ్రీను వంటి వారు సైతం సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కమెడియన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఇమ్మూ.. కేవలం కామెడీ చేయడమే కాకుండా టాస్కులలో సైతం అదరగొట్టాడు.

కాగా హౌస్ లో మూడు సార్లు కెప్టెన్ అవ్వడమే కాకుండా సీజన్ మొత్తంలో అత్యధిక టాస్కులు గెలిచిన వ్యక్తి సైతం ఇమ్మానుయేలే. మరీ ముఖ్యంగా పది వారాలపాటు నామినేషన్స్ లోకి రాకుండా కూడా ఎక్కువగా ఓటింగ్ తెచ్చుకున్నాడు. ఇమ్మూ లేకపోతే ఈ సీజన్ 9 లేదు అనేట్టుగా తన కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. దాంతో మొదటి నుంచి అతడే విజేత అవుతాడని అనుకున్నారు. కానీ విన్నర్ కాకపోయినా.. టాప్ లో ఉంటాడని అనుకున్నారు. మొత్తానికి ఎవరూ అనుకోని విధంగా టాప్ 4లో ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో ఇది కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు ఇమ్మానుయేల్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ గురించి కూడా జోరుగా చర్చ నడుస్తోంది. ఇమ్మూ రోజుకు రూ.35 వేల రెమ్యునరేషన్ చొప్పున.. వారానికి రూ.2.25 లక్షలు తీసుకున్నారని అంటున్నారు. మొత్తం 15 వారాలకు గానూ ఏకంగా రూ.33 లక్షల 75 వేల పారితోషికం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇమ్మానుయేల్ బిగ్‌బాస్ విజేత కాకపోయినా.. ప్రేక్షకుల గుండెల్లో మాత్రం విన్నర్ అంటూ సపోర్ట్ చేస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications