నిజ జీవిత ఘటనల ఆధారంగా "రిమ్‌జిమ్".. మరో 1990 బ్యాగ్రౌండ్ మూవీ !!

1990ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రిమ్‌జిమ్". 'అస్లీదమ్' అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందుతున్న ఈ చిత్రంలో అజయ్ వేద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించడమే కాకుండా.. సినిమాలోని రెండు పాటలను సైతం ఆలపించడం విశేషం. ఈ పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలానే వ్రజన హీరోయిన్‌గా కనిపించనుండగా.. సహాయక పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాసు అలరించనున్నారు.

జి. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు కలిసి ఏవీ సినిమాస్, సి విజువల్స్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. స్నేహం, ప్రేమ కథగా రూపొందుతున్న ఈ సినిమా.. ఆ కాలపు సామాజిక పరిస్థితులను, యువతలోని అశాంతిని చక్కగా ప్రదర్శిస్తుందని మూవీ యూనిట్ వెల్లడించింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. హేమ సుందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లేను అందించారు. చిత్రీకరణ తుది దశకు చేరుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

interesting-details-abot-rim-jim-movie-starring-ajay-and-rahul-siplihgunj

ఈ క్రమంలోనే దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. 'రిమ్ జిమ్' అద్భుతంగా రూపొందిందని, దాని ఆకట్టుకునే కథా కథనం, భావోద్వేగ బలం కారణంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజాన్ని దగ్గరగా చూపించే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని.. ప్రేక్షకులందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు.

కాగా కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ, VFX, కెమెరా క్వాలిటీ, కథ చెప్పే పద్ధతులు కూడా అప్డేట్ అవుతున్నాయి. అలానే ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కథలు, కొత్త ప్రయోగాలు, కొత్త జానర్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఓ వైపు బడ్జెట్‌లు కూడా భారీగానే పెరుగుతూ పాన్ ఇండియా చిత్రాలు నిర్మాణం అవుతున్నాయి. మరోవైపు వినూత్న కంటెంట్, కొత్త కథా శైలి, నేచురల్ నటన, రియలిస్టిక్ స్క్రీన్‌ప్లే తో వస్తున్న చిన్న చిత్రాలు కూడా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఈ మూవీ కూడా ఆ కోవకే చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+