Jana Nayagan Trailer Review:దళపతి విజయ్ ఆఖరి వేట..!!
Jananayagan Trailer Review:కోలీవుడ్ సూపర్ స్టార్ తళపతి విజయ్ నటించిన 'జననాయకుడు' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్, విజయ్ కెరీర్‌లో 69వ సినిమా మాత్రమే కాదు.. ఆయన వెండితెరకు వీడ్కోలు పలుకుతున్న చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే, విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశానికి ఈ సినిమాను ఒక బలమైన పునాదిగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది.
ట్రైలర్ ఎలా ఉందంటే?
ట్రైలర్ ప్రారంభం నుంచే విజయ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవర్ ఫుల్ డైలాగ్స్‌తో హోరెత్తిపోయింది. "ప్రజాస్వామ్యానికి కాపలాదారుడు" అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగా, సామాన్యుల పక్షాన నిలబడి అన్యాయాన్ని ఎదిరించే ఒక నాయకుడిగా విజయ్ కనిపిస్తున్నారు.విజయ్ తనదైన శైలిలో చేసిన ఫైట్స్, స్టైలిష్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది.

ఈ సినిమాలో విజయ్ తండ్రి పాత్రలో నటిస్తుండగా,మలయాళ బ్యూటీ మమిత బైజు ఆయన కూతురిగా కనిపించనుంది.వారిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపిస్తున్నారు.విజయ్ - బాబీ డియోల్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయేలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
రాజకీయ మైలేజ్ కోసం డైలాగ్స్?
ట్రైలర్‌లో విజయ్ చెప్పిన కొన్ని డైలాగ్స్ ఆయన నిజజీవిత రాజకీయ పార్టీ 'TVK' (తమిళగ వెట్రి కళగం) ఉద్దేశాలను ప్రతిబింబించేలా ఉన్నాయి. "ప్రజల కోసం నిలబడేవాడే నిజమైన నాయకుడు" అనే అర్థం వచ్చేలా ఉన్న సంభాషణలు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం.
తారాగణం:
విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కేవీఎన్ (KVN) ప్రొడక్షన్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది.ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న 'జననాయగన్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications