98వ "ఆస్కార్" అవార్డులకు షార్ట్‌లిస్ట్ అయిన జాన్వీ కపూర్ మూవీ..!
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు రంగం సిద్దమవుతోంది. కాగా 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. ఇందుకోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను 2026 జనవరి 22న ప్రకటించనున్నట్లు అకాడమీ వెల్లడించింది. లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ 98వ ఆస్కార్ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన చిత్రాలు ఇందులో పోటీపడనున్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఆస్కార్ అవార్డులపై ఇండియాలో కూడా క్రేజ్ పెరిగింది.
కాగా 98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఆస్కార్ బరిలోకి ఇండియా నుంచి పలు చిత్రాలు పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, పుష్ప 2, గాంధీతాత చెట్టు, కన్నప్ప లాంటి సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడి రేసు నుంచి తప్పుకున్నాయి. అయితే ఇప్పుడు ఇండియా నుంచి పోటీలో నిలిచిన చిత్రాల్లో "హోమ్ బౌండ్" మూవీ ఘనత సాధించింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది.

"హోమ్ బౌండ్" సినిమాకు నీరజ్ ఘైవాన్ దర్శకత్ వహించారు. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తమ సొంత గ్రామాలకు తిరిగి వెళ్లడానికి ప్రయత్నించే ఇద్దరు నిరుపేద ఉత్తర భారతీయ స్నేహితుల కథగా చెప్పొచ్చు. సామాజిక అసమానతలు, కుల వివక్ష, పేదరికం, ఆకస్మికంగా ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కలిగే కష్టాలను ఇందులో చూపించారు. చందన్ (దళితుడు), షోయిబ్ (ముస్లిం) అనే ఇద్దరి నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్టిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక జాన్వీ కపూర్ .. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహి', 'మిల్లి', 'గుడ్ లక్ జెర్రీ' వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలానే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
Homebound is officially shortlisted for Best International Feature Film at the 98th Academy Awards😭❤️😭❤️ pic.twitter.com/OAoia77Q3h
— Netflix India (@NetflixIndia) December 17, 2025
మరోవైపు సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన చిత్రం 'మహావతార్ నరసింహ'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. మహావిష్ణువు అవతారమైన నరసింహుని కథాంశంలో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ యానిమేషన్ కేటగిరీలో ఆస్కార్ లో ఎంట్రీ సాధించినట్టు అకాడమీ వెల్లడించింది.
-
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
ఉగాది పండగ వేళ చిరంజీవి సంచలన నిర్ణయం.. -
సమంత, రాజ్ నిడిమోరు క్యూట్ వీడియో వైరల్..! -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
ధురంధర్2, ఉస్తాద్ భగత్ సింగ్.. వీటిల్లో ఏ సినిమాకు వెళ్లాలి? -
రూ. 2 వేల కోట్ల బొమ్మ.. "ధురంధర్ - ది రివెంజ్" రివ్యూ.. ఇది సార్ సినిమా అంటే !! -
‘ధురంధర్2’లో హైలైట్స్ ఇవే.. దద్ధరిల్లుతున్న థియేటర్లు -
నవాజ్ షరీఫ్ నుంచి అజిత్ ధోవల్ దాకా.. ధురంధర్ 2లో ఎవరెవరు ఏ రోల్? -
ధురంధర్-2 పై RGV రివ్యూ.. షోలే కంటే 100 రెట్లు గొప్పగా.. స్పీల్ బర్గ్, నోలన్ సైతం.. -
ధురంధర్ 2 ట్విట్టర్ రివ్యూ: మాస్టర్ పీస్.. ఎపిక్ బ్లాక్ బస్టర్












Click it and Unblock the Notifications