తమిళనాడులో మొదటిరోజు టాప్ కలెక్షన్లు ఈ హీరోలవే
ఒకప్పుడు తమిళ సినిమా అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మాత్రమే వినిపించేది. ఆయన సినిమా వస్తోందంటే బాక్సాఫీస్ వద్ద ఊహకందని 'రాంపేజ్' ఉండేది. కాలక్రమేణా మారుతున్న ట్రెండ్‌లో తమిళ మార్కెట్‌ను సింగిల్ హ్యాండ్‌తో దళపతి విజయ్ ఏలుతున్నారు. ప్రస్తుతం ఆయన చివరి సినిమా జననాయగన్ విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇదే ఆయన చివరి సినిమా. టీవీకే పేరుతో పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్నారు.
దరిదాపుల్లో ఎవరూ లేరు
సినిమాల పరంగా మిగిలిన స్టార్ హీరోలు విజయ్ సాధిస్తున్న ఓపెనింగ్స్ దరిదాపుల్లోకి రాలేకపోతున్నారు. సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తూ విజయ్ దూసుకుపోతున్నారు. తన సమకాలీన హీరోలు ఎంత జోరు చూపించినా, విజయ్ సృష్టించిన సాలిడ్ స్పీడ్ మరియు క్రేజ్‌ను అందుకోవడం వారికి సవాలుగా మారింది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజు కళ్లు చెదిరే వసూళ్లు రాబట్టడం దళపతికి మాత్రమే సాధ్యమవుతోంది.

అజిత్ ఆధిపత్యమా?
రేసులో అజిత్, ఇతర హీరోలున్నప్పటికీ విజయ్ తర్వాత అజిత్ కుమార్ కు తమిళనాడులో భారీ క్రేజ్ ఉంది. అయితే, విజయ్ రికార్డులను దాటే స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడంలో అజిత్ ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. తను చేస్తున్న విభిన్న ప్రయోగాలతోనే అజిత్ గౌరవప్రదమైన ఓపెనింగ్స్ సాధిస్తున్నారు. వీరిద్దరి తర్వాత మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' వంటి భారీ మల్టీస్టారర్ చిత్రాలు మాత్రమే ఈ జాబితాలో పోటీ పడుతున్నాయి. తమిళనాడులో విజయ్ బీస్ట్ , రెండో స్థానంలో లియో, మూడో స్థానంలో సర్కార్, నాలుగో స్థానంలో గోట్, 5వ స్థానంలో వలిమై, ఆరో స్థానంలో కూలీ, ఏడో స్థానంలో గుడ్ బ్యాడ్ అగ్లీ, 8వ స్థానంలో పొన్నియన్ సెల్వన్, 9వ స్థానంలో బిగిల్, 10వ స్థానంలో విడాయుముర్చి సినిమాలు నిలిచాయి. విజయ్ తర్వాత ఇప్పుడు అజిత్ అగ్రహీరోగా అవతరించాడు. సినిమాల్లోకి విజయ్ తిరిగిరాడు కాబట్టి కొన్ని సంవత్సరాలు విజయ్ ఆధిపత్యం కొనసాగే అవకాశం కనపడుతోంది.












Click it and Unblock the Notifications