మహేష్ బాబు కెరీర్‌లో చేసిన బిగ్ మిస్టేక్స్... ఆ 3 సినిమాలు వదులుకోవడమేనా?
హీరో అన్న తర్వాత తన దగ్గరకు కొన్ని కథలు వస్తుంటాయి. వాటిని విన్న తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చెబుతుంటారు. మరికొన్నిసార్లు షెడ్యూల్స్ దొరకవు. మరికొన్నిసార్లు కథ నచ్చదు.. ఇలా అనేక రకాల కారణాలతో కొన్ని కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వస్తుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్‌లో అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అయితే, ఆయన వదులుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధించాయి. మురుగదాస్ 'గజిని'ని మహేష్ తిరస్కరించడం ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపు. సూర్యను స్టార్‌గా మార్చిన ఆ సినిమా, మహేష్ బాబును అయితే పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లేదని చెప్పొచ్చు. అప్పుడే పాన్ ఇండియా హీరో అయ్యేవారు. అప్పట్లోనే ఆయన రేంజ్ మరోలా ఉండేది.

సుకుమార్ తొలి ఎంపిక మహేష్ బాబు
దర్శకుడు సుకుమార్ తొలుత మహేష్ బాబు కోసమే 'పుష్ప' కథను సిద్ధం చేశారు. స్మగ్లర్ పాత్ర, ఆ గెడ్డం, మాస్ మేనరిజమ్స్ తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ కావని మహేష్ భావించారు. పాత్ర వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మారి నటించడం, హావభావాలు పలికించడం, బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం నిజమైన నటుడి ప్రథమ లక్షణం. కానీ మహేష్ బాబు ఆ లక్షణాలకు బహుదూరం. అల్లు అర్జున్ ఆ పాత్రను ఛాలెంజ్‌గా తీసుకుని గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు.
మహేష్ బాబులోని మాస్ కోణాన్ని ఆవిష్కరించడానికి సుకుమార్ గట్టిగా ప్రయత్నం చేశారుకానీ తనంతటతానే ఒక గొప్ప అవకాశాన్ని వదులుకున్నారు ప్రిన్స్. 'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ రెడ్డి వంగా ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్‌తో మహేష్ బాబును కలిశారు. కానీ, సందీప్ మార్క్ వయొలెన్స్, బోల్డ్ కంటెంట్ తన ఫ్యామిలీ ఆడియన్స్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని మహేష్ వెనకడుగు వేశారు. ఆ తర్వాత రణబీర్ కపూర్ 'యానిమల్'తో బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. 'పోకిరి', 'బిజినెస్ మేన్' చిత్రాల్లో మహేష్ చూపించిన ఆ గట్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ 'యానిమల్'లో చూసే అవకాశం అభిమానులు కోల్పోయారని చెప్పొచ్చు.
అసలు విషయాన్ని గ్రహించాలి
మహేష్ బాబు సినిమాల ఎంపికను గమనిస్తే, ఆయన ఎప్పుడూ తన బ్రాండ్ వాల్యూ, ఫ్యామిలీ క్రేజ్‌ను కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. అందుకే పుష్ప లేదా యానిమల్ వంటి రా అండ్ రస్టిక్ పాత్రల పట్ల ఆయన మొగ్గు చూపలేదు. అయితే, సమకాలీన హీరోలు ప్రయోగాలు చేస్తూ గ్లోబల్ మార్కెట్ వైపు వెళ్తున్న తరుణంలో, మహేష్ ఒకే రకమైన సాఫ్ట్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితం కావడం కొంత మైనస్ అయిందని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా మహేష్ బాబు మారాలి. ఎప్పుడూ ఒకేరకంగా సినిమాల్లో కనపడటం అనేది అభిమానులకు కొంతకాలం వరకు బాగుంటుందికానీ తర్వాత బోరు కొట్టేస్తుంది. ఈ విషయాన్ని గ్రహిస్తే చాలు.
-
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications