మలయాళం స్టార్ మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం..!
ప్రముఖ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 90 ఏళ్లు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శాంతకుమారి అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్‌లాల్ తండ్రి, దివంగత విశ్వనాథన్ నాయర్ ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించారు.
ఈ విషాద ఘటన పట్ల పలువురు మలయాళ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా తన తల్లి వల్లే తాను ఈ స్థానంలో ఉన్నట్లు మోహన్‌లాల్ ఎన్నో సందర్భాల్లో వెల్లడించారు. తన విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడేవారని.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సమయంలో మొదట ఆమె సమక్షంలోనే ఆనందాన్ని పంచుకున్నట్లు తెలిపారు.

మరోవైపు మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. 1978లో తన తొలి చిత్రం తిరనోట్టంతో సినీ రంగంలో అడుగుపెట్టారు. మంజిల్ విరింజా పుక్కల్ (1980) సినిమాతో హిట్ అందుకొని హీరోగా గుర్తింపు పొందారు. నాటి నుంచి తనదైన శైలిలో అలరిస్తూ కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, హిందీ, తెలుగు సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు పొందారు. నటనలో తనకు తానే సాటి అనేలా.. కంప్లీట్ యాక్టర్ గా నిలిచారు.
హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు ఈ సీనియర్ హీరో. నటుడిగానే కాకుండా నిర్మాతగా, గాయకుడిగా, థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా టాలెంట్ నిరూపించుకున్నారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ నటుడిగా పలుమార్లు అవార్డు అందుకున్న ఆయనను.. భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. రీసెంట్ గానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా పొందారు.
ఇక ఇటీవలే మోహన్ లాల్ నటించిన 'వృషభ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నంద కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం కోసం దాదాపు 70 కోట్లు ఖర్చు చేయగా.. ఆడియన్స్ ని ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications