శివాజీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన మెగా బ్రదర్ నాగబాబు..!

నటుడు శివాజీ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారమే రేపుతోంది. "దండోరా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వేదికగా ఆయన చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి శ్రీపాద, యాంకర్ అనసూయ రియాక్ట్ అవ్వడం.. మహిళా కమిషన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం సినీ వర్గాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ విషయంలోకి నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు ఎంటర్ అయ్యారు. ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సుదీర్ఘ వీడియో విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

నాగబాబు ఫైర్..

సమాజం పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తోందని వాటినుంచి బయటకు రావాలని నాగబాబు పిలుపునిచ్చారు. మోడ్రన్‌ దుస్తులు ధరించడం తప్పు కాదని.. మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు వారి డ్రెస్‌ల వల్ల కాదని.. మగవాళ్ల క్రూరత్వం వల్ల అని ఘాటుగా విమర్శించారు. తాను రాజకీయ నాయకుడిగానో, ఎమ్మెల్సీగానో, సినీ నటుడిగానో మాట్లాడడం లేదని.. ఒక సామాన్య వ్యక్తిగా అభిప్రాయం చెబుతున్నానని స్పష్టం చేశారు. అలానే తాను శివాజీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లేదని.. అయితే సమాజంలో వేళ్లూనుకున్న మోరల్ పోలీసింగ్ అనే రుగ్మతపై మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిపారు.

mlc-nagababu-fires-on-sivaji-comments-over-women-dressing

ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి.. ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయాలపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని నాగబాబు అన్నారు. ఆడవాళ్లు ఇలాంటి డ్రెస్‌లు మాత్రమే వేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది? ప్రతి మహిళకు ఆత్మగౌరవం ఉంటుంది. వస్త్రధారణ అనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఫ్యాషన్ కాలక్రమేణా మారుతూ ఉంటుందని.. దానిని అర్థం చేసుకోకుండా మహిళలను తప్పుబట్టడం సరైంది కాదని నాగబాబు అన్నారు.

మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదని.. ప్రపంచం మారుతోందని ఆ మార్పును అంగీకరించాల్సిన బాధ్యత సమాజంపై ఉంది అని చెప్పారు. ప్రతి మహిళను కుటుంబ సభ్యురాలిగా చూడాలని ఆయన సూచించారు. మహిళలను నియంత్రించాలి అనే భావన తప్పు అని.. మగవారితో సమానంగా జీవించే హక్కు మహిళలకు కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలకు నాగబాబు ఒక విజ్ఞప్తి చేశారు. మీకు నచ్చిన దుస్తులు ధరించండి. మీకు నచ్చినట్లు జీవించండి. అయితే మన సమాజంలో ఇంకా పూర్తి భద్రత లేదన్న వాస్తవాన్ని గుర్తుంచుకుని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అవసరమైతే స్వీయరక్షణ విద్యలు నేర్చుకోండి అని సూచించారు.

తాను అన్ని మగవాళ్లను తప్పుబట్టడం లేదని, కొందరి వికృత ఆలోచనల గురించే మాట్లాడుతున్నానని నాగబాబు స్పష్టం చేశారు. అలానే ఆడవాళ్లను అవమానించిన వారు ఎప్పుడూ బాగుపడినట్లు చరిత్రలో లేదు. మహిళలకు నాలాంటి వారు ఎప్పుడూ అండగా ఉంటారు అని అన్నారు. మహిళల హక్కులు, స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై మౌనం పాటించకూడదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో స్పందించడం ప్రతి ఒక్కరి బాధ్యతని.. మౌనం కూడా ఒక రకమైన తప్పే అని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+