గోపీచంద్ మలినేని మూవీ కోసం బాలయ్య కొత్త అవతారం.. ర్యాంపేజ్ పక్కా !!
నందమూరి బాలకృష్ణ.. ఆయన గురించి చెప్పాలంటే ఒకే ఒక్క మాట చాలు అదే "జై బాలయ్య". అదే ఆయన డైలాగ్ లతో ఆయన గురించి చెప్పాలంటే.. ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా ... చరిత్రంటే మాదే, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయలన్నా మేమే... నరుకుతూ పోతుంటే నీకు అలుపు వస్తుందేమో. నాకు మాత్రం ఊపు వస్తుంది.. ఇలా డైలాగులు చెప్పాలన్నా .. ఆరు పదుల వయసులో సైతం అదరగొట్టే స్టెప్పులు వేయాలన్నా అది బాలయ్యకే సాటి.
స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడిగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన శైలిలో రాణించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా తనలోని టాలెంట్ ని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటారు. ఈ ఏడాది సంక్రాంతికి 'డాకు మహరాజ్'తో హిట్ అందుకున్న ఆయన.. మొత్తంగా వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన "అఖండ 2" చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

కాగా పలు కారణాలతో పలుమార్లు వాయిదా పడ్డ ఈ మూవీ.. మొత్తానికి అభిమానులను, సినీ ప్రేమికుల ఆకలి తీర్చింది అని చెప్పాలి. డిసెంబర్ 12న ఆడియన్స్ ముందుకు రాగా.. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 'అఖండ' మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంలో.. సంయుక్త హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మించారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇక తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టారు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేయగా.. రీసెంట్ గానే పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కానుండగా.. బాలకృష్ణ మరోసారి ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. పిరియాడికల్ మైథాలజీ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు. వృధ్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి తమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
అప్పుడు మామ ఏక్ పెగ్ లా..
గోపీచంద్ - బాలయ్య కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం కోసం బాలకృష్ణ సింగర్ గా మారబోతున్నారని తెలియజేశారు. స్వయంగా బాలకృష్ణ ఓ పాట కూడా పాడబోతున్నారని తమన్ రివీల్ చేశారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన "పైసా వసూల్" చిత్రంలో మామ ఏక్ పెగ్ లా అనే పాట పాడి అదరగొట్టారు. దీంతో మళ్లీ బాలయ్య సింగర్ గా దుమ్ము రేపడం పక్కా అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
-
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
నేనేం పతివ్రతను కాదు - బుల్లితెర బ్యూటీ












Click it and Unblock the Notifications