బాక్సాఫీస్ బరిలో నాగ్ తో బాలయ్య డైరెక్ట్ ఢీ: ఒకేరోజు ఈ రెండు మూవీలు విడుదల
నందమూరి బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ ఫిల్మ్.. ఎన్బీకే 111. వృద్ధి సినిమాస్ పతాకంపై కిలారు వెంకట సతీష్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మరోసారి బాలయ్య- కాజల్ అగర్వాల్ జతకట్టడంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించడం దీనికి కారణం. ఈ మూవీలో బాలయ్య మాస్ లుక్ తో కనిపించడం హైప్ పెంచింది.
ఈ ఫిల్మ్ టైటిల్ గ్లింప్స్, విడుదల తేదీ వెల్లడయ్యాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు 'దాదా' అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు అయింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24వ తేదీన విడుదల కానుంది. రగ్డ్ అండ్ పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపించాడు. శత్రువుల ఆట కట్టిస్తూ యాక్షన్ సీక్వెన్స్‌లతో బాలయ్య చేసిన విధ్వంసం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. బాలయ్య పలికిన డైలాగ్స్ అద్దిరిపోయాయి.

'నాకు గురి పెట్టాలంటే.. ఒంట్లో పవర్, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్ కి బలుపు ఉండాలి.. గన్స్ కి గట్స్ ఉండాలి..' అనే డైలాగ్స్ కు విజిల్స్ పడటం ఖాయం. ఈ గ్లింప్స్‌లో ఆయనను కింగ్ ఆఫ్ ఖోస్ అని అభివర్ణించిన విధానం ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ ఎలివేషన్ గ్లింప్స్‌ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. ముంబై మాఫియాతో మొదలవుతుందీ గ్లింప్స్. పోలీస్ స్టేషన్ లో ఫైట్ హైలైట్.
అక్కినేని నాగార్జున నటిస్తోన్న 100వ చిత్రం కింగ్ తో బాలయ్య ఫిల్మ్ డైరెక్ట్ గా ఢీ కొడుతోంది. డిసెంబర్ 24వ తేదీ నాడే కింగ్100 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో బాలయ్య, నాగార్జున మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ అనివార్యమైంది. ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో ఫ్యాన్ వార్ కూడా తప్పకపోవచ్చు. క్రిస్మస్ పండుగ సెలవులు, లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ రెండు సినిమాలకు కలిసి వస్తోండటంతో డిసెంబర్ 24వ తేదీనే ఖరారు చేశారు దాదా మేకర్స్.
Call him #DADA 🔥🔥🔥🦁🦁🦁
— Gopichandh Malineni (@megopichand) September 6, 2026
Christ-MASS is coming…⁰See you all on Dec 24th :) ❤️
Title glimpse
▶️ https://t.co/TSeKc2eQAU#DADAonDEC24th pic.twitter.com/p7H7hKbqYj
ఈ హైబడ్జెట్ ప్రాజెక్ట్ లో సముద్రఖని కీలక పాత్రను పోషిస్తున్నాడు. గతంలో బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన వీరసింహారెడ్డి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో దాదాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి. అయిదు నెలల ముందే విడుదల తేదీ ఖరారు కావడంతో షూటింగ్ తో పాటు ప్రమోషన్లపైనా దృష్టి పెట్టనుంది యూనిట్.













Click it and Unblock the Notifications