ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్నారు. ప్రస్తుతం వరుస హిట్లతో మంచి జోరుమీద ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 111వ సినిమా చేస్తున్నారు. ముంబయిలో మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నారు. నయనతార కథానాయిక.
బాలయ్యకు మొదటి నుంచి తన తండ్రి తారకరామారావు అంటే విపరీతమైన భయం. ఆయన ముందు బాలయ్యే కాదు.. కుటుంబ సభ్యులెవరూ నోరు తెరిచి మాట్లాడే సాహసమే చేసేవారు కాదు. ఒక్క హరికృష్ణ మాత్రం చాలా ధైర్యంగా ఉండేవారు. తండ్రి చెప్పిన మాటకు కొడుకులైనా, కూతుర్లైనా ఎదురు చెప్పడానికి వీల్లేదు. అంతటి క్రమశిక్షణతో ఎన్టీఆర్ వారిని పెంచారు.

మెడికల్ నాకొద్దని గట్టిగా చెప్పిన బాలయ్య
బాలయ్య కుమార్తె బ్రాహ్మణి ఒకొనొక సందర్భంలో తన తండ్రికి సంబంధించిన విషయాలు చెబుతూ ఒక ముఖ్యమైన సంఘటనను వివరించారు. బాలయ్యను డాక్టర్ ను చేద్దామని ఎన్టీఆర్ అనుకున్నారు. ఇంటర్ లో బైపీసీ తీసుకోమంటే ఇష్టం లేకపోయినా తీసుకున్నారు. కానీ ధైర్యంగా తాను సినిమాల్లోకి వెళతాను అని చెప్పలేకపోయారు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష కూడా రాశారుకానీ సీటు రాలేదు. ఆ చదువుకోవడం, ఆ మెడికల్.. ఇదంతా బాలయ్యకు ఎక్కలేదు. వెంటనే ఏదైతే అదవుతుందనే ధైర్యంతో మెడికల్ తనకొద్దని, తాను సినిమాల్లోకి వెళతానంటూ తండ్రికి గట్టిగా చెప్పేసి వెళ్లిపోయారు.
ఏడాదికి 3 సినిమాలు విడుదలయ్యేలా
దీంతో ఎన్టీఆర్ కూడా బాలయ్యకు సినిమాలపై ఉన్న తపన చూసి ఓకే చెప్పారు. చిన్నప్పుడు తాతమ్మ కలలో బాలనటుడి పాత్ర వేశారు. తర్వాత అన్నదమ్ముల అనుబంధం సినిమా ద్వారా బాలయ్యను వెండితెరకు పరిచయం చేశారు. ఇది హీరోగా మొదటి సినిమా. 1975లో విడుదలైంది. అప్పటి నుంచి బాలకృష్ణ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఈరోజుకు యువహీరోలకు ధీటుగా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. సంవత్సరానికి కనీసం మూడు సినిమాలు విడుదల చేయాలనే ప్రణాళికలో ఉన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications