OG రేంజ్ కు డబుల్ ప్లాన్ చేసిన సుజిత్- అన్ ఎక్స్ పెక్టెడ్ టైటిల్

వరుస విజయాలతో తన ఇమేజ్‌ను పెంచుకుంటున్న నేచురల్ స్టార్ నాని నేడు తన పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా నానితో ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు పవన్ కల్యాణ్ 'OG' దర్శకుడు సుజిత్. దీనికి సంబంధించి5న టైటిల్ గ్లింప్సెస్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. నాని- సుజిత్ కాంబినేషన్ లో రాబోతోన్న ఈ చిత్రానికి 'బ్లడీ రోమియో' టైటిల్ ను ఖరారు చేశారు. సుజిత్ దర్శకత్వంలో నాని నటించబోతోండటం ఇదే తొలిసారి.

యానిమేటెడ్ వీడియోగా విడుదలైన ఈ గ్లింప్సెస్ లో ఓ గ్యాంగ్ స్టర్ డెన్ అనే బిల్డింగ్ లో నాని ఓ చెఫ్‌ ప్లస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. అతని పాత్ర కూడా అలాగే ఉండబోతోందనే హింట్ ఇచ్చింది చిత్రం యూనిట్. ఈ గ్లింప్స్‌కు స్టార్ కమేడియన్ వెన్నెల కిషోర్ వాయిస్‌ ఓవర్ ఇవ్వడ ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రవీణ్ వైరా అద్భుత నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ వేసవిలో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన క్రూ అండ్ కాస్ట్ ఇంకా తెలియాల్సి ఉంది.

Natural Star Nani Transforms into a Gangster Chef for a Witty Pan India Thriller Named Bloody Romeo

ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తోన్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మోహన్ బాబు, సొనాలి కులకర్ణి, రాఘవ్ జుయెల్, తణికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తోన్నారు. కమేడియన్ గా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఇందులో బిర్యానీ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నారు. కాయదు లోహర్ ఓ కీలక పాత్రకు ఎంపికైంది.

ఇదివరకు నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 2023 విడుదలైన ఈ సినిమా నాని కేరీర్ లో ఓ బ్లాక్ బస్టర్. 120 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందా ఫిల్మ్. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో ది ప్యారడైజ్ రాబోతోంది. ఇదివరకు నాని ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. రెండు రోజుల కిందటే సంపూర్ణేష్ బాబును ఫస్ట్ లుక్ కూడా వెలుగులోకి వచ్చింది. 'బిర్యానీ' పాత్రలో రక్తసిక్తమైన అవతారంలో కనిపించాడిందులో.

అల్లూరి సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయింది కాయదు లోహర్. తమిళం, కన్నడ సినిమాల్లో సైతం అరంగేట్రం చేసింది. ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన డ్రాగన్ తో మంచి గుర్తింపు లభించింది. తెలుగులో ప్యారడైజ్ తో పాటు ఫంకీలోనూ నటిస్తోంది. ఏకకాలంలో పలు సినిమాలకు సైన్ చేసింది. ఇధయం మురళి, ఇమ్మోర్టల్, అరసన్, తరమ్ సినిమాల్లో నటిస్తోంది. ఇధయం మురళీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటోంది. ఈ వేసవిలో విడుదల కావొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+