బాలయ్య ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు..!!
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం.. ఎన్బీకే 111. ఇది వర్కింగ్ టైటిల్. పీరియాడికల్ హిస్టారికల్ మూవీగా ఇది తెరకెక్కబోతోంది. గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత బాలయ్య అలాంటి సినిమాను చేయబోతోన్నారు. ఆయన సరసన నయనతార నటిస్తోంది. క్వీన్ రోల్ పోషిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్నాడీ సినిమాకు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. హిస్టారికల్ డ్రామా కావడం, మల్టీ లింగ్వల్ హీరోయిన నయనతార తీసుకోవడం.. ఇది పాన్ ఇండియా మూవీ అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. నేడు ముహూర్తం షాట్ చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ టైటిల్ లోగోను ఆవిష్కరించింది చిత్రం యూనిట్. ఇందులో ఓ వారియర్ గా కనిపించాడు బాలయ్య. రెండు విభిన్న గెటప్ లల్లో దర్శనం ఇచ్చాడు. చేతుల్లో కత్తులు, మారణాయుధాలను పట్టుకుని కోట గోడలపై నిల్చున్న యోధుడిగా రెండు భిన్నమైన పాత్రలు అవి. దీన్ని బట్టి చూస్తే డ్యూయెల్ రోల్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

డాకు మహరాజ్ తర్వాత బాలయ్య నటిస్తోన్న మూవీ ఇదే కావడం, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. అలాగే- వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రాబోతోన్న సినిమా కూడా ఇదే. వీరసింహారెడ్డి ఏ లెవెల్ లో ఆడిందో తెలిసింది. ఇండస్ట్రీ హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే స్థాయిలో ఈ మూవీ కూడా ఉంటుందని అభిమానులు ఆశిస్తోన్నారు. 2026 వేసవి సీజన్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
బాలకృష్ణ కొత్త సినిమా అఖండ 2.. డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు పీక్స్ లో జరుగుతున్నాయి. త్వరలో మీడియా అవుట్ హౌస్ లకు ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. బోయపాటి శీను దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య అఘోరీ క్యారెక్టర్ ను కొనసాగించడం, హిమాలయాల్లో చిత్రీకరణ జరుపుకోవడం వంటివి హైలైట్ గా నిలిచాయి.
Big day ❤️❤️
— Gopichandh Malineni (@megopichand) November 26, 2025
A new beginning… a new benchmark.
This HISTORICAL ROAR, this vision…
is finally taking its first breath.
As we begin today, my heart is full and my purpose is clear. Grateful to walk this path with God of Masses #NandamuriBalaKrishna garu 🤗🤗🙏🏻🙏🏻#NBK111… pic.twitter.com/hdXn9jUrTt












Click it and Unblock the Notifications