Ustaad Bhagat Singh: పండగలాంటి వార్త: కల్ట్ చూపించే టైమ్ వచ్చింది బాస్

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటిస్తోన్న సినిమా.. ఉస్తాద్ భగత్ సింగ్. హైఓల్టేజ్ యాక్షన్‌ మూవీ ఇది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. హరీష్ శంకర్ దర్శకుడు. మైత్రీ మూవీస్ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. శ్రీలీల హీరోయిన్. అశుతోష్ రాణా, నవాబ్ షా, అవినాష్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. తమిళంలో విజయ్ నటించిన థేరి సినిమాకు రీమేక్ ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pawan Kalyan s Ustaad Bhagat Singh First Single Promo out on 9th December

2012లో రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ కూడా వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమానే కావడం వల్ల దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిందా మూవీ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం అదే స్టైల్‌లో ఉంటుందని సంబరపడుతున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు పవన్ కల్యాణ్ రగ్డ్ లుక్స్‌లో కనిపిస్తోండటం మరింత హైప్‌ను ఇచ్చినట్టయింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న అభిమానులకు పండగలాంటి వార్త అందింది.

ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల తేదీ వెల్లడైంది. ఈ నెల 9వ తేదీన ఇది విడుదల కానుంది. సాయంత్రం సరిగ్గా 6:30 గంటలకు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల కానున్నట్లు చిత్రం యూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేసింది. విశాల్ దద్లానీ పాడిన పాట అది. భాస్కరభట్ల రాసిన పాటకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

ఓజీ తర్వాత పవన్ కల్యాణ్ నుంచి వస్తోన్న అప్ కమింగ్ మూవీ ఇదే కావడం వల్ల అందరి చూపూ దీని మీదే ఉంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇది భారీ హిట్ కొడుతుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. దీని తర్వాత పవన్ కల్యాణ్ చేయబోయే సినిమాలు ఏమిటనేది కూడా హాట్ టాపిక్ అయింది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ తరహాలోనే మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+