ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండగే.. నేడే "రాజాసాబ్" ప్రీ రిలీజ్..అలానే !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ఆయన.. సలార్, కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం మారుతితో రాజా సాబ్‌.. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

కాగా ఇప్పుడు "రాజా సాబ్" వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో మాళవిక మోహనన్ తో పాటు.. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

prabhas-rajasaab-movie-pre-release-event-details

కాగా ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ రేస్‌లో అరడజనుకు పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్ రాజాసాబ్ తో పాటు మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకి విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి వంటి సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మరో రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉండటంతో పోటీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ మూవీ టీం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది.

ఈ మేరకు నేడు ( డిసెంబర్ 27, 2025 ) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌ వేదికగా జరగనున్న ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కూకట్ పల్లి ఖైతలాపూర్ గ్రౌండ్స్ లో ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్‌.. ఫ్యాన్స్‌ మధ్యకు వచ్చి చాలా కాలం అవుతోంది. సలార్ సినిమాను ఎలాంటి ఈవెంట్ లేకుండానే రిలీజ్ చేశారు.

కల్కి సినిమా ప్రమోషన్స్ లో కూడా తక్కువ గానే పాల్గొన్నారు. దాంతో దాదాపు మూడేళ్లు తర్వాత పబ్లిక్ ఈవెంట్ లో కనిపించనున్నారు డార్లింగ్. అంతే కాకుండా మాములుగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లను విడుదలకు రెండు లేదా మూడు రోజుల ముందు నిర్వహిస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 13 రోజుల ముందుగానే ప్లాన్ చేస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

అయితే ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తున్న తరుణంలో మారుతితి సినిమా అంటే అంతా షాక్ అయ్యారు. కానీ ఫస్ట్ టైం ప్రభాస్‌ చేత హార్రర్ కామెడీ చేయించడం.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టడంతో మూవీ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వింటేజ్ డార్లింగ్‌ను చూపిస్తానని మారుతి చెప్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటి వరకు ఆ సినిమా లుక్ రివీల్ కాలేదు.. దాంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ పోలీస్ లుక్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+