అనూహ్యంగా ప్రభాస్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్ - ఓపెన్ క్లారిటీ ఇదీ

డార్లింగ్ ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం స్పిరిట్ (Spirit). 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. త్రిప్తి డిమ్రి, త్రిష, నాయికగా నటిస్తోన్నారు. గుల్షన్ కుమార్, టీ-సిరీస్ సమర్పణలో, టీ-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ప్రధాన నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, శివ్ చనానా సహ నిర్మాతగా ఉన్నారు.

టీ-సిరీస్ చీఫ్ నీరజ్ కళ్యాణ్ కూడా నిర్మాణంలో భాగం అయ్యారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు ఉర్దూ, మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లోనూ విడుదల కానుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చతున్నారు. సుప్రీమ్ సుందర్ యాక్ఝన్ కోరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తోన్నారు. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విడుదలైంది. ప్రభాస్, త్రిప్తి డిమ్రి కనిపించారిందులో.

Prakash Raj Reportedly Walks Away From Prabhas Spirit Movie differences with Sandeep Reddy Vanga

కాగా ఈ సినిమాపై తాజా సమాచారం అందింది. ఈ చిత్రం నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. సెట్స్‌లో విభేదాలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వార్తలపై ప్రకాష్ రాజ్ గానీ, చిత్ర నిర్మాతలు గానీ, యూనిట్ గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓటీటీ ప్లే ప్రచురించిన కథనం ప్రకారం- ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తోన్నట్లు మొదట్లో ప్రకటించారు.

ఆ తర్వాత.. సందీప్ రెడ్డి వంగాతో స్క్రిప్ట్, ఓ నిర్దుష్ట సన్నివేశం చిత్రీకరణ విషయంలో తీవ్ర వాదనలు జరిగాయని, పరిస్థితులు మరింత దిగజారాయని ఓటీటీ ప్లే తెలిపింది. దీంతో ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ప్రొడక్షన్ టీమ్ తో ప్రకాష్ రాజ్ ప్రవర్తన కూడా ఇబ్బందికరంగా మారిందని కొందరు పేర్కొంటున్నారు. ఈ కారణాల వల్ల నిర్మాతలు ఆయనతో భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకుముందు స్పిరిట్ నుండి దీపికా పదుకొనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

దీనిపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ వార్తలను తోసిపుచ్చారు. ఘాటుగా స్పందించారు. తనపై వాట్సప్ యూనివర్శిటీలు ఫేక్ వార్తలను ప్రచారం చేస్తోన్నాయని విమర్శించారు. స్పిరిట్ నుండి తాను తప్పుకొన్నట్లు వచ్చిన వార్తలను ఫేక్ / వాట్సప్ కథనాలుగా అభివర్ణించారు. ఈ సినిమాలో ఇంకా తన సన్నివేశాల చిత్రీకరణే ప్రారంభం కాలేదని వివరించారు. వాట్సప్ ఫ్యాక్టరీలతో కథలను ఊహించి రాశారని చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+