రాక పోస్టర్ పై మిశ్రమ స్పందన - ఇలాగైతే ఎలా బాసూ..!!
టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ కమర్షియల్ కింగ్ అట్లీ.. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటేనే అంచనాలు భారీగా ఉండాలి. తాజాగా విడుదలైన 'రాకా' ఫస్ట్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో భిన్నమైన చర్చకు దారితీసింది. పుష్పరాజ్‌గా ప్రపంచాన్ని ఊపేసిన బన్నీ నుంచి ఏదో ఊహించిన అభిమానులకు, అట్లీ ఇచ్చిన 'రాకా' లుక్ బన్నీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
చాలా రిచ్ గా ఉంటాయి
సాధారణంగా అట్లీ సినిమాల్లో విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉంటాయి. కానీ, 'రాకా' పోస్టర్ చూస్తుంటే.. అల్లు అర్జున్ ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటోను ఏదైనా ఏఐ టూల్‌లో వేసి 'బీస్ట్ మోడ్'లోకి మార్చినట్లుగా ఉందనే కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్లు పెడుతున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులు ఒక్క పోస్టర్‌తోనే సినిమా కథా వస్తువును చెబితే.. అట్లీ మాత్రం పాత పద్ధతిలోనే కేవలం హీరో ఎలివేషన్ మీద మాత్రమే దృష్టి పెట్టినట్లు అనిపిస్తోంది. జనవరిలో వచ్చిన ప్రభాస్-సందీప్ వంగా 'స్పిరిట్' పోస్టర్ సృష్టించిన ఇంపాక్ట్‌తో పోల్చుకుంటే, 'రాకా' వెనకబడిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముగ్గురు అగ్రహీరోల పోటీ
ఒకే సీజన్‌లో ముగ్గురు అగ్ర హీరోలు మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ పోటీ పడుతున్నప్పుడు, ప్రమోషన్ల విషయంలో చిన్న తప్పు జరిగినా అది సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 'రాకా' టీమ్ కేవలం బన్నీ క్రేజ్ మీద మాత్రమే భారమంతా వేయకుండా, కంటెంట్‌లో ఉన్న కొత్తదనాన్ని ప్రమోషన్లలో చూపెట్టాల్సిన అవసరం ఉంది. అట్లీకి మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. 'రాజా రాణి' నుంచి మొన్నటి 'జవాన్' వరకు ఆయన ట్రాక్ రికార్డ్ అద్భుతం.
ప్రస్తుతానికి పోస్టర్ విషయంలో నెగెటివ్ టాక్ నడుస్తున్నా, నెక్స్ట్ వచ్చే టీజర్ లేదా గ్లింప్స్‌తో సీన్ మొత్తం రివర్స్ చేసే సత్తా అట్లీకి ఉంది. లోపల బలమైన కంటెంట్ ఉంటే, ఒక పోస్టర్ సినిమా జాతకాన్ని మార్చలేదు. 'రాకా' కేవలం మాస్ మసాలా చిత్రంగా మిగిలిపోతుందా? లేక అట్లీ చెప్పినట్లుగా ఒక సరికొత్త కాన్సెప్ట్ మూవీగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అన్నది తెలియాలంటే మరికొన్ని అప్‌డేట్స్ వచ్చేవరకు చూడాలి.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications