రకుల్ ప్రీత్ సింగ్ ఫోన్ నెంబర్ 81110***** కావాలా.. కానీ !!

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 'గిల్లి' అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్.. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో తెలుగులో లాంఛ్ అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. అలానే తమిళంలో కూడా మంచి పేరు సంపాదించుకుంది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ.. ఇప్పుడు కొంచెం సన్నబడింది.

కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ భగ్నాని ఈ ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ పలు సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి అప్డేట్స్ ఇస్తోంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఏకంగా ఫోన్ నెంబర్ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

rakul-preet-singh-warning-about-fake-whatsapp-account-to-fans

అసలేం జరిగిందంటే..?

ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా స్కామ్‌లు, ఫేక్ లింకులు, ఫిషింగ్ ఇమెయిల్స్ వంటి ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పూటకో వేషం మారుస్తున్న నెరగాళ్లు.. ఇటీవల నటీనటుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తూనే ఉంటున్నాం. ఇటీవల హీరోయిన్లు అదితి రావు హైదరి, రుక్మిణి వసంత్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వేరే నెంబర్లకు హీరోయిన్ల ఫోటోలు డీపీలుగా పెట్టి మోసాలకు తెరలేపారు. ఈ ఘటనలు తమ దృష్టికి రావడంతో వారు అలర్ట్ అయ్యి సోషల్ మీడియా వేదికగా అభిమానులను హెచ్చరించారు. ఇప్పుడు ఇదే షాక్ రకుల్ కి కూడా తగిలినట్టు తెలుస్తోంది.

అది నా నెంబర్ కాదు - రకుల్

ఈ మేరకు ఆ పోస్టులో.. హాయ్ గైస్. నా పేరుతో ఎవరో వాట్సాప్‌లో చాట్ చేస్తున్నారని తెలిసిందన్నారు. అది తన అధికారిక నంబరు కాదని రకుల్ ప్రీత్ సింగ్ తన అభిమానులకు ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా పోస్ట్ చేశారు. ఈ నకిలీ వాట్సాప్ నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలని, ఎవరూ దానికి మెసేజ్‌లు పంపవద్దని ఆమె సూచించారు. కాగా 8111067586 మొబైల్ నంబర్ కు రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోను వాట్సాప్ డీపీలో పెట్టారు. బయో వివరాలలో ఆమె సినిమా పేర్లు కూడా రాశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+