"బిగ్ బాస్" టైటిల్ గెలిస్తే.. ఆ తర్వాత పవన్‌తో అలా చేస్తా...
తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో "బిగ్‌బాస్". వరుసగా ఎనిమిది సీజన్ల విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 9వ సీజన్ కూడా ప్రేక్షకులకు వినోదాలను పంచింది. వచ్చే ఆదివారంతో ఈ సీజన్‌కు అధికారికంగా ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు 15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఈ రియాలిటీ షో చివరి వారంలోకి అడుగుపెట్టడంతో టాప్ 5 మాత్రమే మిగిలారు. ప్రస్తుతం హౌస్ లో.. డీమాన్ పవన్, సంజన, కళ్యాణ్, తనూజ, ఇమ్మానుయేల్ ఉన్నారు. దీంతో టైటిల్ గెలుచుకునేది ఎవరా అని జోరుగా చర్చ నడుస్తోంది.
కాగా ఈ సీజన్ లో లవ్ బర్డ్స్‌గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు రీతూ చౌదరి - డిమోన్ పవన్. బిగ్‌బాస్ హౌస్‌లో వీరిద్దరి వ్యవహారం పట్ల భారీగా ట్రోలింగ్ జరిగింది. టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ వచ్చిన పవన్.. ఆ తర్వాత రీతూ మ్యాటర్ లో నాగార్జున క్లాస్ పీకడంతో కొంచెం డౌన్ అయ్యాడు. అయితే ఇప్పుడు రీతూ చౌదరి ఎలిమినేట్ అవ్వగా.. పవన్ మాత్రం టాప్ 5లో చోటు దక్కించుకుని టైటిల్ రేసులో ఉన్నాడు. దాంతో పవన్ కోసం రీతూ సపోర్ట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఇక ఇప్పటికే గ్రాండ్ ఫినాలే కోసం ఇప్పటికే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగా .. తమ ఫెవరేట్ కంటెస్టెంట్స్ కోసం వారి మిత్రులు, మాజీ కంటెస్టెంట్స్ అండగా నిలుస్తూ ఓటు వేయాలని అభ్యర్ధిస్తున్నారు. ఈ క్రమంలోనే రీతూ చౌదరి కూడా డిమోన్ పవన్‌కు ఓటు వేయాలని కోరుతూ రీతూ చౌదరి ఓ వీడియో విడుదల చేసింది. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఈ వీడియో ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది.
టైటిల్ గెలిచాక అలానే చేస్తా..
పవన్ తనకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని, హౌస్‌లో నన్ను చాలా బాగా చూసుకున్నాడని ఎలిమినేట్ అయ్యాక ప్రెస్‌మీట్‌లో చెప్పారు రీతూ చౌదరి. అలానే ఈ వీడియోలో మాట్లాడుతూ డిమోన్ పవన్ .. జెన్యూన్ , ఇన్నోసెంట్, నైస్ పర్సన్ అని వ్యాఖ్యానించింది.
అంతే కాకుండా గేమ్స్‌లో ముందుంటాడని.. ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనడని తెగ పొగిడేసింది. పవన్‌తో భవిష్యత్తులోనూ తన ప్రయాణం సాగుతుందని రీతూ చౌదరి క్లారిటీ ఇచ్చింది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక అతనితో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేయబోతున్నట్లు తెలిపింది. అందుకు ముందు డిమోన్ పవన్‌కు ఓట్లు వేసి బిగ్‌బాస్ టైటిల్ విన్నర్ గా గెలిపించాలని అభ్యర్ధించింది.

-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications