'కాంతార' కు మించిన బీభత్సం.. దేవుడిగా స్టార్ హీరో.. గ్లింప్స్ కే గూస్ బంప్స్ గ్యారంటీ..!
కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ రూటే సెపరేటు.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను థ్రిల్ ను పంచుతున్నాడు. ఇటీవల పరాశక్తి మూవీతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని అలరించాడు. అంతకుముందు అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వడంలో శివకార్తికేయన్ ముందుంటాడు.
గతంలో కమల్ హాసన్ బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థతో అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ తాజాగా మరోసారి అదే బ్యానర్ లో ఓ వినూత్నమైన కథతో సినిమా చేయనున్నారు. ఈ మూవీకి 'శేయోన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ ను ఇవాళ విడుదల చేశారు. దాదాపు 3 నిమిషాల 30 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో చూస్తుంటే తమిళనాడు గ్రామీణ దైవం అయిన విరుమాంది నేపథ్యంలో స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న క్రమంలో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
'శేయోన్' అంటే తమిళంలో మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) అని అర్థం వస్తుంది. ఈ మూవీలో శివకార్తికేయన్ మురుగన్ భక్తుడిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంశతో ఉన్న శక్తివంతమైన పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఎప్పటికప్పుడు విభిన్న కథలను ఎంచుకునే శివ కార్తికేయన్ ఈ మూవీతో ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరిస్తారో చూడాలి. డాక్టర్ నుంచి ఇటీవల రిలీజైన పరాశక్తి వరకు ఆయన కథలు చాలా కొత్తగా.. సాధారణ సినిమాలకు భిన్నంగా ఉంటాయి. ఈ ఏడాది పొంగల్ కానుకగా విడుదలైన పరాశక్తి మూవీ తెలుగులో సరిగ్గా ఆడకపోయినా వరల్డ్ వైడ్ గా ఈ మూవీకి రూ. 100 కోట్లకు పైగా రావడం విశేషం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న 'శేయోన్' మూవీతో శివ కార్తికేయన్ ఎంత మేరకు అలరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications