"బిగ్ బాస్ 9 తెలుగు" టైటిల్ విన్నర్‌గా లేడీ సింగం తనూజ..?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో "బిగ్ బాస్". ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. 9వ సీజన్ కూడా ప్రేక్షకులకు వినోదాలను పంచింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఈ సీజన్ కు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈసారి గత సీజన్ల కంటే భిన్నంగా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటూ కొత్త కనసేపయట తీసుకొచ్చారు. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అంటూ జోరుగా చర్చ నడుస్తోంది.
మొత్తానికి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లుగా ఇమ్మానుయేల్, పవన్, కళ్యాణ్, సంజన, తనూజ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో సంజన 5వ పొజిషన్ లో.. ఇమ్మూ 4వ స్థానంలో ఎలిమినేట్ అయ్యారని సమాచారం. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైనప్పటి నుంచి తనూజ, లేదా ఇమ్మానుయేల్ విన్నర్ అవుతారని అందరూ భావించారు. అయితే కామన్ మాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ పడాల.. మధ్యలో అమ్మాయిల విషయంలో కొంచెం ట్రోలింగ్ ఎదుర్కొన్న కానీ మళ్లీ టాస్కులలో, బిహేవియర్ తో మళ్లీ గట్టిగానే కం బ్యాక్ ఇచ్చారు.

దీంతో ఇమ్మానుయేల్ టాప్ 2 లో ఉండడం పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా 4వ స్థానానికే పరిమితం కావడం అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో టైటిల్ వీణ అయ్యేది ఎవరా అని మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం విన్నర్ ఎవరో అన్ అఫిషియల్ పోలింగ్ లో ద్వారా రివీల్ చేస్తున్నారు.
విజేతగా లేడీ సింగం..?
అయితే ముందు నుంచి అనుకున్నట్టు గానే టాప్ 2 లో కళ్యాణ్, తనూజ ఉన్నట్టు భావిస్తున్నారు. మూడో స్థానాన్ని డీమోన్ పవన్ దక్కించుకున్నట్టు అంటున్నారు. కాగా ఆ టాప్ లో విజేతగా నిలిచేది మాత్రం తనూజ అని బలంగా చర్చ నడుస్తోంది. దాంతో గత ఎనిమిది సీజన్లలో టైటిల్ గెలుచుకున్న వారంతా మగవారే అని .. తొలిసారి లేడీ విజేతగా నిలవనుందని భావిస్తున్నారు. ఈ మేరకు తనూజ ఫ్యాన్స్ అంతా ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ నెట్టింట హల్ చల్ చేస్తున్నారు. మరి నిజంగా టైటిల్ గెలిచేది ఎవరో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగక తప్పదు.












Click it and Unblock the Notifications