టీజర్ అవుట్- అన్నీ కలిపి కుట్టారా? ఏంటీ?
నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తోన్న అప్ కమింగ్ మూవీ.. స్వయంభూ. పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సంయుక్త మీనన్, నభా నటేష్, సుబ్బరాజు, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ చిత్రం టీజర్.. విడుదల అయింది. సినిమా ప్రపంచాన్ని ఆవిష్కరించింది. భారీ అంచనాలను రేకెత్తించింది. చీకటి ఆవరించినప్పుడు, అభేద్యమైన యోధుడు స్వయంభూగా అవతరిస్తాడు. ధైర్యాన్ని నమ్మి, ధర్మాన్ని రక్షించడానికి పోరాడతాడనేది ఈ మూవీ కాన్సెప్ట్.
భువన్, శ్రీకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా క్రీస్తు శకం 985 నాటి ఓ వారియర్ బ్యాక్ గ్రౌండ్ కథతో చిత్రీకరణ జరుపుకొంటోంది. చక్రవర్తుల విధిని నిర్దేశించే 'సెంగోల్' అనే అజేయమైన రాజదండం చుట్టూ కథ అల్లుకుంది. ఓ యోధుడిగా నిఖిల్ నటిస్తోన్నాడు. ఈ క్యారెక్టర్ కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు. సాంకేతికంగా స్వయంభూ ప్రపంచ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతోందనేది టీజర్ చెప్పకనే చెప్పినట్టయింది.

ఏప్రిల్ 10వ తేదీన 10 భాషల్లో విడుదల కాబోతోంది. ఆరంభం నుంచే ఓ భారీ పీరియాడికల్ ప్రపంచాన్ని పరిచయం చేసిందీ టీజర్. నిర్మాణ విలువలు, 900 దశకం నాటి వాతావరణం సహా మొత్తం ప్రెజెంటేషన్ ఆకట్టుకుంది. ప్రతీ ఫ్రేమ్ సినిమాటిక్‌గా అనిపించింది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు పాత్రకు మరింత బలాన్ని చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోందీ టీజర్ చూస్తే. నిఖిల్.. ఇదివరకెప్పుడూ చేయని పవర్ ఫుల్ కొత్త అవతార్‌లో కనిపించాడు. అతని రూపం, బాడీ లాంగ్వేజ్.. క్యారెక్టర్ పై అతనికున్న ప్యాషన్ ను చూపింది.
Swayambhu is the Story of an UNDERDOG who has BIG dreams.. just like most of us ..
— Nikhil Siddhartha (@actor_Nikhil) February 11, 2026
This is just the INTRODUCTION to the World Of Swayambhu.. a lottt moreee coming uppp.. l Hope u all like it... Plz do Support and Bless us 🙏🏽
WATCH WITH EARPHONES 👇🏾 https://t.co/7Iqz8KEKTg pic.twitter.com/MqQsf76mIT
ఇది వరకు కార్తీకేయ, కార్తికేయ 2 వంటి సోషియో ఫాంటసీ సినిమాల్లో నటించాడు గానీ.. ఓ వారియర్ గా పీరియాడికల్ మూవీలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి. అతనికి ఛాలెంజింగ్ తో కూడుకున్న క్యారెక్టర్ ఇది. ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనేది ఏప్రిల్ 10వ తేదీన తేలిపోతుంది. హనుమాన్, హరిహర వీరమల్లు, సైరా, బింబిసార.. వంటి పీరియాడికల్ డ్రామాలు సక్సెస్ అవుతున్న నేపథ్యంలో నిఖిల్ కూడా అదే పంథాను అనుసరిస్తోన్నట్టయింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications