రామ్‌చరణ్ చేయనంటే అల్లు అర్జున్ చేసి బ్లాక్‌బస్టర్ కొట్టాడు
తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం, అది కాస్తా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం చాలా సాధారణంగా జరిగిపోతుంటుంది. టాలీవుడ్‌లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. మెగా హీరోల విషయంలో జరిగిన ఒక ఆసక్తికరమైన మార్పు.. అల్లు అర్జున్ కెరీర్‌నే మలుపు తిప్పింది. అప్పటివరకు లేని అతి పెద్ద సూపర్ హిట్ ను అందించింది. అదేంటో కాదు.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రేసుగుర్రం.
మైండ్ లో రామ్ చరణ్ ఉన్నాడు
దర్శకుడు సురేందర్ రెడ్డి తనదైన స్టైలిష్ టేకింగ్‌తో 'రేసుగుర్రం' కథను సిద్ధం చేసుకున్నప్పుడు, ఆయన మైండ్‌లో ఉన్న మొదటి పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చరణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ ను డిజైన్ చేసుకున్నారు. సురేందర్ రెడ్డి ఈ కథను రామ్ చరణ్‌కు వినిపించాలని ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో చరణ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కథ వినడానికి కూడా అవకాశం దొరకలేదు. అదే సమయంలో ఈ విషయం గురించి, కథ గురించి తెలుసుకున్న అల్లు అర్జున్, 'బ్రదర్ సెంటిమెంట్', హీరోను తీర్చిదిద్దిన విధానం నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అల్లు అర్జున్ కు మైల్ స్టోన్
2014లో విడుదలైన 'రేసుగుర్రం' అప్పట్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అల్లు అర్జున్ నటన, శ్రుతి హాసన్ గ్లామర్, ముఖ్యంగా బ్రహ్మానందం 'కిల్ బిల్ పాండే' కామెడీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. బన్నీ కెరీర్‌లోనే అప్పటివరకు లేని విధంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఒకవేళ చరణ్ ఈ సినిమా చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో కానీ, బన్నీకి మాత్రం ఇది ఒక 'మైల్ స్టోన్' సినిమాగా నిలిచిపోయింది.
రేసుగుర్రం మిస్ అయినా, సురేందర్ రెడ్డి - రామ్ చరణ్ కాంబినేషన్ లో 'ధృవ' సినిమా వచ్చింది. చరణ్ కెరీర్‌లోనే మంచి సినిమాగా నిలిచింది. తమిళ హిట్ 'తని ఒరువన్'కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంతో చరణ్ తనలోని సీరియస్ నటనను పరిచయం చేశారు. ఆ సినిమా చేయడంద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసంతోనే 'రంగస్థలం', 'RRR' వంటి చిత్రాలు చేసి గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు.
-
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
"ధురంధర్ 2 సినిమాను బ్యాన్ చేయాలి" -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications