వాయిదా పడ్డ రూ.1,000 కోట్ల సినిమా

రాకింగ్ స్టార్ యష్ అప్ కమింగ్ మూవీ.. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్.. ఇటీవలే విడుదలైంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కన్నడం, తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో చిత్రీకరణ జరుపుకొంది. ఈ అయిదు భాషల్లో టీజర్ రిలీజ్ అయింది. రాయా క్యారెక్టర్ లో నటించాడు యష్. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి తారలు నటిస్తున్నారు.

కేవీఎన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉండగా.. అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4 వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న అస్థిర పరిస్థితులు, రణవీర్ సింగ్ ధురంధర్ 2 కూడా అదే రోజు విడుదల కాబోతోన్న నేపథ్యంలో తమ సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకున్నట్లు చిత్రం యూనిట్ తెలిపింది.

పంపిణీదారు ఫార్స్ ఫిల్మ్స్ సలహా మేరకు విడుదల తేదీని మార్చారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు కలగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మాతలు తెలిపారు. గల్ఫ్ కీలక మార్కెట్ కావడం వల్ల వాయిదా వేయక తప్పట్లేదని వివరించారు.

Toxic Delayed Release Date Pushed to June 4 Amid Middle East Tensions and Dhurandhar 2 from March

నిజానికి, ఈ నెల 8న బెంగళూరులో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌ చిత్రం యూనిట్ ప్రిపేర్ అయింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'తబాహి' విడుదలకూ సన్నాహాలు చేసింది. ఇప్పుడు ఈ రెండు కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. కొత్త విడుదల తేదీకి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేశారు. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ప్రస్తుత అస్థిరత పరిస్థితుల నేపథ్యంలో విడుదల తేదీని జూన్ 4వ తేదీకి మార్చామని, తమ సినిమా విస్తృతంగా ప్రేక్షకులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల దిల్ రాజు దక్కించుకున్నారు. ఏకంగా 120 కోట్ల రూపాయలకు ఏపీ, తెలంగాణల్లో థియేట్రికల్ హక్కులను శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేసింది. 'టాక్సిక్' చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అదే రోజు రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన 'ధురంధర్ 2: ది రివెంజ్ కూడా విడుదల కానుండటంతో బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+