శ్రీరామనవమికి వారణాసి రిలీజ్ డేట్ లాక్?

సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి. పాన్ వరల్డ్ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకొంటోందీ మూవీ. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్లెస్ ఈ సినిమాపై హైఎక్స్ పెక్టేషన్స్ ఇచ్చాయి. సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. రుద్రగా గతంలో ఎప్పుడో చేయని రోల్ లో మెరుపులు మెరిపించబోతోన్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఇందులో కీ రోల్.

ఈ సినిమాపై తాజా సమాచారం వెలువడింది. 2027లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వారణాసి యూనిట్ అధికారికంగా వెల్లడించింది. COMING IN 2027 అని అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ అకౌంట్ లో దీన్ని షేర్ చేసింది. టైటిల్ గ్లింప్సెస్ సమయంలో విడుదల చేసిన ఓ 26 సెకెన్ల నిడివి ఉన్న వీడియోను దీనికి యాడ్ చేసింది. విడుదల సంవత్సరాన్ని బహిరంగంగా ప్రకటించినప్పటికీ.. తేదీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. 2027 ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామనవమి పండగ సందర్భంగా ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుందని తెలుస్తోంది.

Varanasi set to release in 2027 Makers Drop a New Post

వారణాసిలో ముఖ్యమైన రామాయణ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు సినిమా టైటిల్ గ్లింప్స్ ఈవెంట్‌ సందర్భంగా ఎస్ ఎస్ రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. సంజీవినీ పర్వతాన్ని తీసుకొచ్చిన హనుమంతుడి ఉదంతం ఈ సినిమా ప్రధాన కథాంశంగా అప్పట్లో చెప్పారాయన. ఎటు తిరిగి రామాయణం బ్యాక్ గ్రౌండ్ కావడం వల్ల 2027 ఏప్రిల్ 9వ తేదీన శ్రీరామనవమి నాడు సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఈ ఒక్క రామాయణం ఎపిసోడ్‌ను 60 రోజులు చిత్రీకరించింది యూనిట్. తన చిన్నతనం నుండీ రామాయణ మహాభారతాలు అంటే ఎంతో ఇష్టమని, వాటిని అంతే అద్భుతంగా తెరకెక్కించడం తన కలల ప్రాజెక్ట్ అని చాలాసార్లు చెప్పారు. రాజమౌళి. రామాయణం నుండి ఒక ముఖ్యమైన ఎపిసోడ్‌ను ఇంత త్వరగా చిత్రీకరించే అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. శ్రీరాముడి గెటప్ లో మహేష్ బాబును చూసినప్పుడు గూస్‌బంప్స్ వచ్చాయిని, ఆ ఫోటోను వాల్‌పేపర్‌గా కూడా పెట్టుకుని, ఎవరూ చూడకూడదనే ఉద్దేశంతో తీసేశానని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+