Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేరుగా వెళ్లారు..జంటగా తిరిగొచ్చారు - విజయ్ రష్మిక ఇటలీ ట్రిప్ విశేషాలు..!!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి కెమెరా కంటికి చిక్కారు. ఈ జంట పెళ్లి గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు వీరిద్దరూ హైదరాబాద్ విమానాశ్రయంలో కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇటలీలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి.. విడివిడిగా వెళ్లిన వీరిద్దరూ.. తిరిగి జంటగా రావడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా ఇటీవల ఇటలీ నుంచి రష్మిక, విజయ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేశారు. ఒకరి ఫోటోల్లో మరొకరు కనిపించకపోయినా, ఒకే బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఇద్దరూ కలిసి వెకేషన్ ఎంజాయ్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. విజయ్ పోస్ట్ చేసిన ఓ ఫోటోలో అతని భుజంపై ఓ మహిళ తల వాల్చి ఉండటం కూడా చర్చకు దారి తీసింది. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ జంట చాలా సింపుల్‌గా కనిపించారు. మాస్క్‌లు ధరించి, కెమెరాలకు పోజులివ్వకుండా, తమ తమ టీమ్‌లు మరియు సెక్యూరిటీతో వేర్వేరుగా నడిచారు. రష్మిక గ్రే ప్యాంట్, తెల్లటి టాప్, నలుపు కోట్‌లో కనిపించగా, విజయ్ నలుపు ప్యాంట్, లెదర్ జాకెట్, నీలం క్యాప్‌తో కనిపించారు.

vijay-devarakonda-and-rashmika-mandanna-spotted-at-airport-that-back-from-italy

2018లో వచ్చిన 'గీత గోవిందం', 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' సినిమాల నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. అప్పటి నుంచి డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు రష్మిక, విజయ్ ఇద్దరూ తమ పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక మీడియా వర్గాల టాక్ ప్రకారం, 2025 అక్టోబర్ 3న హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. పెళ్లి కూడా నిశ్చితార్థంలాగే సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యనే జరపాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన విజయ్.. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని సక్సెస్ అందుకొని గీతాగోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత నుంచి వరుసగా ఫ్లాప్స్ రావడంతో కొంచెం స్లో అయ్యారు. ఈ ఏడాది కింగ్‌డమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. నేషనల్ క్రష్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది "రష్మిక మందన్నా". ప్రస్తుతం దక్షిణ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస చిత్రాలతో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+