సుప్రీంకోర్టులో 107 ఉద్యోగాలు: అర్హతలివే, ఇలా అప్లై చేయండి

భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివిధ విభాగాల్లోని 107 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో కోర్టు మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, కోర్టు మాస్టర్ పోస్టులున్నాయి.

పోస్టులు, అర్హత వివరాలు ఇలా..

కోర్టు మాస్టర్ (షార్ట్ హ్యాండ్, గ్రూప్-ఎ గెజిటెడ్)-31
లా డిగ్రీ, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లీష్‌లో నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలిగి ఉండాలి.

107 jobs in Supreme Court Apply Now

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బీ, నాన్ గెజిటెడ్)-33
ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్‌లో నిమిషానికి 110 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలగాలి.

పర్సనల్ అసిస్టెంట్ (గ్రూప్-బీ, నాన్ గెజిటెడ్)-43
ఏదైనా డిగ్రీ తోపాటు ఇంగ్లీష్ షార్ట్ హ్యండ్ స్పీడ్ నిమిషానికి 100 పదాలు, కంప్యూటర్‌పై ఇంగ్లీష్ టైపింగ్ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
టైపింగ్, షార్ట్‌హ్యాండ్ టెస్టులు, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. చివరగా డాక్యుమెంట్ వెరీఫికేషన్, ఫిట్‌నెస్ టెస్ట్ విజయవంతమైన తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

కోర్టు మాస్టర్:
ఈ పోస్టుకు టైపింగ్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపకి చేస్తారు. షార్ట్ హ్యాండ్ టెస్ట్‌కు గరిష్ట మార్కులు 100. కనీస అర్హత మార్కులు 50 . ట్రాన్‌స్క్రిప్షన్ వ్యవధి 45 నిమిషాలు. టైపింగ్ టెస్ట్‌కు గరిష్ట మార్కులు 10. కనీసఅర్హత మార్కులు 5. వ్యవధి 10 నిమిషాలు. టైప్ చేసిన పదాల్లో 5 శాతం తప్పులను మినహాయిస్తారు.

దరఖాస్తు గడువు:
దరఖాస్తులు ప్రారంభం తేదీ: డిసెంబర్ 3, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 31, 2024

దరఖాస్తులు ఎలా చేయాలంటే?

అధికారిక వెబ్‌సైట్‌ sci.gov.in ను సందర్శించండి.
నోటీసు విభాగానికి వెళ్లి రిక్రూట్‌మెంట్‌పై క్లిక్ చేయండి.
కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్), సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ కోసం లింక్‌ను ఎంచుకోండి.
రిజిస్ట్రేషన్ నెంబర్ పొందేందుకు అవసరమైన వివరాలను పూరించాలి.
రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
సూచనలను జాగ్రత్తగా చదవండి, దరఖాస్తు ఫారంను పూర్తి చేయండి.
ప్రత్యేక సంఖ్యను రూపొందించడానికి ఫారమ్ సమర్పంచండి.
భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు ఫారంను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+